గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : కసిరెడ్డి
ABN, Publish Date - Dec 30 , 2023 | 12:02 AM
గ్రామాల సమగ్రాభివృద్ధి, పేదరిక నిర్మూలనే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శెట్టిపల్లి గ్రామంలో రూ.11లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, రూ.7.50 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని శుక్రవారం సర్పంచ్ ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, ఎంపీపీ అనితవిజయ్‌లతో కలిసి నారాయణరెడ్డి ప్రారంభించారు.
ఆమనగల్లు, డిసెంబరు 29: గ్రామాల సమగ్రాభివృద్ధి, పేదరిక నిర్మూలనే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శెట్టిపల్లి గ్రామంలో రూ.11లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, రూ.7.50 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని శుక్రవారం సర్పంచ్ ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, ఎంపీపీ అనితవిజయ్‌లతో కలిసి నారాయణరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారిగా గ్రామానికి వచ్చిన కసిరెడ్డికి ఘన స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో మెరుగైన వసతులు కల్పించి ప్రజల ఇబ్బందులు తీరుస్తామన్నారు. ఎంపీటీసీ నిట్ట మంగమ్మనారాయణ, పీఆర్ ఏఈ కృష్ణయ్య, సీసీ రామచంద్రయ్య, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ బాల్‌రామ్‌నాయక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జగన్, సింగిల్ విండో వైస్‌చైర్మన్ సంజీవ్‌యాదవ్, నాయకులు ఖాదర్, కృష్ణనాయక్, ఫరీద్, వస్పుల శ్రీకాంత్, నాజర్, చంద్రమౌళి, మహేశ్, అర్జున్ రావు, శివ, మహేశ్ ఉన్నారు.
Updated Date - Dec 30 , 2023 | 12:02 AM