ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో క్రిస్మస్‌ వేడుకలు షురూ

ABN, Publish Date - Dec 22 , 2023 | 11:41 PM

మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈసందర్భంగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు రోజుల ముందే క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభించారు.

ఎయిర్‌పోర్ట్‌లోని అరైవల్‌ వద్ద ఏర్పాటు చేసిన శాంతాక్లాజ్‌

శంషాబాద్‌ రూరల్‌/షాద్‌నగర్‌, డిసెంబరు 22 : మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈసందర్భంగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు రోజుల ముందే క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభించారు. జీఎంఆర్‌ అధికారులు ఎయిర్‌పోర్టు అరైవల్‌లో శాంతాక్లాజ్‌ను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. అదేవిధంగా విమానాశ్రయంలోని ఎయిర్‌పోర్టు విలేజ్‌లో ప్రయాణికులను ఆకర్శించే విధంగా క్రిస్మస్‌ ట్రీని ఏర్పాటు చేశారు. రోటర్‌ 1 నుంచి రోటర్‌ 5 వరకు దారి పొడవునా రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. అదేవిధంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం షాద్‌నగర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రీక్రిస్‌మస్‌ వేడుకలను నిర్వహించారు. షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జయలక్ష్మి కేక్‌ కట్‌ చేశారు. ఆమె మాట్లాడుతూ క్రీస్తు జననం, ఆయన ప్రజలకు చేసిన సేవల గురించి వివరించారు. డాక్టర్‌ అమృత జోసఫ్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాసులు, ఆప్తాలమిక్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ జె.శ్రీహరి, చిట్టిబాబు, సీహెచ్‌వో ఉదయ్‌కుమార్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 11:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising