బైక్‌ను లారీ ఢీకొని.. ఇద్దరు దుర్మరణం
ABN, First Publish Date - 2023-12-05T23:28:12+05:30
బైక్‌ను లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన దుర్ఘటన మంగళవారం మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కీసర మండలం చీర్యాల్ సమీపంలో ఘటన
కీసర రూరల్, నవంబరు 5: బైక్‌ను లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన దుర్ఘటన మంగళవారం మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కీసర మండలం చీర్యాల గ్రామానికి చెందిన కోటయ్య(37), త్రినాథ్(48)లు ద్విచక్రవాహనం (ఏపీ 29ఏహెచ్ 2013)పై పని నిమిత్తం స్థానిక ఈడెన్‌గార్డెన్ కాలనీకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈక్రమంలో చీర్యాల్ కమాన్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. లారీ చక్రాలు వారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనదారులు రాంగ్ రూట్‌లో రావడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-12-05T23:28:13+05:30 IST