ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాలాజీసింగ్‌కు ‘ఎమ్మెల్సీ’ ఇవ్వాలి

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:33 PM

ప్రత్యేక తెలంగాణ సాధనలో భాగంగా ముం దుండి ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు, నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఠాగూర్‌ బాలాజీసింగ్‌ను ఎమ్మెల్సీ పదవికి నామినేట్‌ చేయాలని మాజీ ఎంపీపీ అన్నేపాక జంగయ్య, మాజీ ఎంపీటీసీ దేవయ్యగౌడ్‌ కోరారు.

మాడ్గుల, డిసెంబరు 18 : ప్రత్యేక తెలంగాణ సాధనలో భాగంగా ముం దుండి ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు, నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఠాగూర్‌ బాలాజీసింగ్‌ను ఎమ్మెల్సీ పదవికి నామినేట్‌ చేయాలని మాజీ ఎంపీపీ అన్నేపాక జంగయ్య, మాజీ ఎంపీటీసీ దేవయ్యగౌడ్‌ కోరారు. ఈమేరకు మాడ్గుల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహిచారు. వారు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బాలాజీసింగ్‌ విదేశాల నుంచి వచ్చితెలంగాణ కోసం కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రామగ్రామాన తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేసినట్లు గుర్తుచేశారు. అదే విధంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారయణరెడ్డి గెలుపు కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. ఎమ్మెల్సీగా బాలాజీ సింగ్‌కు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రస్థాయి నాయకత్వం ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో నిరంజన్‌గౌడ్‌, జెల్ల చంద్రయ్యగౌడ్‌ ఉన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:33 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising