ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దారి దోపిడీ దొంగల అరెస్టు

ABN, Publish Date - Dec 30 , 2023 | 12:00 AM

జాతీయ రహదారులపై వాహనాలను ఆపి పోలీసుల పేరుతో దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రంగస్వామి తెలిపారు.

మరో ఇద్దరి కోసం పోలీసుల గాలింపు

షాద్‌నగర్‌ రూరల్‌, డిసెంబరు 29 : జాతీయ రహదారులపై వాహనాలను ఆపి పోలీసుల పేరుతో దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రంగస్వామి తెలిపారు. షాద్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 5న నారాయణపేట నుంచి వడ్ల లోడుతో హైదరాబాద్‌ వెళ్తున్న డీసీఎంను షాద్‌నగర్‌ సమీపంలోని అనూష సర్కిల్‌ వద్ద షాబాజ్‌, సయ్యద్‌ అన్వర్‌, మహ్మద్‌ సోయెల్‌, షాబాజ్‌ అనే నలుగురు ఆపి క్యాబిన్‌లోకి వెళ్లి డ్రైవర్‌ వద్ద ఉన్న రూ.50 వేలు తీసుకుని పారిపోయినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేసి మహ్మద్‌ సోయల్‌, అన్వర్‌లను అరెస్ట్‌చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:00 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising