ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంబేడ్కర్‌ జీవితం అందరికీ ఆదర్శం

ABN, Publish Date - Dec 24 , 2023 | 11:37 PM

రాజ్యాంగ రచయిత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జీవితం సమాజంలోని ప్రతీ ఒక్కరికి ఆదర్శమని మేడ్చల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే చామాకూర మల్లారెడ్డి అన్నారు.

కీసరలోని అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

కీసర, డిసెంబరు 24: రాజ్యాంగ రచయిత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జీవితం సమాజంలోని ప్రతీ ఒక్కరికి ఆదర్శమని మేడ్చల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే చామాకూర మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రం కీసరలో ఆదివారం అంబేడ్కర్‌ విగ్రహానికి 100వ వారం జ్ఞానమాల వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే చామాకూర మల్లారెడ్డి, టీపీసీసీ మేడ్చల్‌ నియోజకవర్గం తోటకూర వజ్రేష్‌ యాదవ్‌లు విచ్చేసి అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహత్ములను స్మరించుకోవడం మన బాధ్యత అని తెలిపారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ద్వారా నేడు ప్రతీఒక్కరు రాజ్యాంగ ఫలాలు పొందుతున్నారన్నారు. మహాత్ములను స్మరించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం ఎంపీపీ ఇందిర లక్ష్మీనారాయణ, సహకార సంఘం చైర్మన్‌ రామిడి ప్రభాకర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ నాయాకపు మాధురి వెంకటేష్‌, మాజీ ఎంపీటీసీలు రమే్‌షగుప్తా, జంగయ్య యాదవ్‌, అంబేడ్కర్‌ సంఘం అధ్యక్షుడు మొరుగు రవీందర్‌, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామిడి విజయ్‌రెడ్డి, వార్డుసభ్యురాలు స్వప్న, జూపల్లి రవీందర్‌, స్థానిక నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 11:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising