ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చికిత్స పొందుతూ మహిళ మృతి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:23 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించింది.

బైక్‌ ఢీకొనడంతో తీవ్రగాయాలు.. కుమార్తె పరిస్థితి విషమం

యాచారం, డిసెంబరు 17 : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించింది. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. గత శుక్రవారం సాయంత్రం యాచారం మండల పరిధిలోని సాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై చౌదర్‌పల్లికి చెందిన తల్లీకూతుళ్లు అమీర్‌పేట ఐలమ్మ(58) ఆమె కుమార్తె అచ్చన శోభలు శుక్రవారం సాయంత్రం చౌదర్‌పల్లి గేటు సమీపంలో రోడ్డు దాటేందుకు యత్నిస్తున్నారు. ఇంతలో గున్‌గల్‌ గేటు నుంచి యాచారం వైపు వస్తున్న ద్విచక్రవాహనదారుడు(తేజారాం) వారిని ఢీకొట్టాడు. దాంతో తల్లీకుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నగరంలోని కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. ఐలమ్మ చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. ఆమె కుమార్తె శోభ పరిస్థితి విషమంగా ఉంది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపాల్‌ తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 11:23 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising