ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ దుర్మరణం

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:01 AM

రోడ్డు దాటుతున్న ఓ మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన శనివారం శంషాబాద్‌ సిద్ధాంతి జాతీయ రహదారి మలుపు వద్ద జరిగింది.

శంషాబాద్‌, డిసెంబరు 30 : రోడ్డు దాటుతున్న ఓ మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన శనివారం శంషాబాద్‌ సిద్ధాంతి జాతీయ రహదారి మలుపు వద్ద జరిగింది. ఆర్జీఐఏ పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌ఐ వెంకటేశ్‌ కథనం ప్రకారం.. విజయవాడ పట్టణంలో నివాసముండే కట్ట విజయలక్ష్మి(45) కుమార్తె శంషాబాద్‌లో ఉంటుంది. శనివారం కుమార్తెను చూడటానికి విజయవాడ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న బస్సులో వచ్చిన విజయలక్ష్మి సిద్ధాంతి జాతీయ రహదారి వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. కాగా, విజయలక్ష్మి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్‌ తెలిపారు.

Updated Date - Dec 31 , 2023 | 12:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising