ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డ్రగ్స్‌ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:15 AM

మున్సిపల్‌ పరిధిలోని తొండుపల్లి బస్‌స్టాప్‌ వద్ద ఓ వ్యక్తి డ్రగ్స్‌ విక్రయిస్తుండగా శంషాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్‌ సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

14 గ్రాములు స్వాధీనం

శంషాబాద్‌రూరల్‌, డిసెంబరు 27 : మున్సిపల్‌ పరిధిలోని తొండుపల్లి బస్‌స్టాప్‌ వద్ద ఓ వ్యక్తి డ్రగ్స్‌ విక్రయిస్తుండగా శంషాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్‌ సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నంద్యాలకు చెందిన సత్యనారాయణ కొంత కాలంగా మున్సిపల్‌లోని మధురాగనర్‌లో నివాసం ఉంటున్నాడు. బుధవారం తొండుపల్లి బస్‌స్టాప్‌ వద్ద ప్లాస్టిక్‌ కవర్‌లో 4 గ్రాముల మెథక్వాల్‌, 10 గ్రాముల అంపెంటోమెన్స్‌(డ్రగ్స్‌) అమ్మతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై నర్సింహారావు సిబ్బందితో వెళ్లి సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. 14 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కొంత కాలంగా శంషాబాద్‌లోని కాలేజీల్లో చదువుకునే విద్యార్థులకు డ్రగ్స్‌ అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మాదక ద్రవ్యాలు అతడు కాచిగూడ లింబోలి అడ్డకు చెందిన మల్లేష్‌ దగ్గర గ్రాముకు రూ.3,500లకు కొనుగోలు చేసి విద్యార్థులకు మెథక్వాల్‌ గ్రాముకు రూ.6,000లకు, అంపెంటోమెన్స్‌ గ్రాముకు రూ.6,500లకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. దీని వెనకల ఎవరెవరున్నారు? డ్రగ్స్‌ ఎక్కడి నుంచి తెస్తున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎన్‌డీపీఎ్‌స యాక్ట్‌ 1985 ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Dec 28 , 2023 | 12:15 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising