ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రగతి భవన్‌ నుంచి డాక్టర్‌ తుప్ప ఆనంద్‌కు పిలుపు

ABN, First Publish Date - 2023-10-30T23:54:17+05:30

ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ తుప్ప ఆనంద్‌కు ప్రగతిభవన్‌ నుంచి పిలుపువచ్చింది. తనను కలవాలంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నుంచి పిలుపు రావడంతో ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌కు వెళ్లి కలిశారు.

కేటీఆర్‌కు మొక్కను బహూకరిస్తున్న డాక్టర్‌ తుప్ప ఆనంద్‌

  • కలిసి పని చేద్దాం.. త్వరలో మళ్లీ కలుద్దామన్న కేటీఆర్‌

వికారాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ తుప్ప ఆనంద్‌కు ప్రగతిభవన్‌ నుంచి పిలుపువచ్చింది. తనను కలవాలంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నుంచి పిలుపు రావడంతో ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌కు వెళ్లి కలిశారు. మొదట ఆనంద్‌ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకున్న కేటీఆర్‌.. ఆ తర్వాత వృత్తి, సేవా కార్యక్రమాల గురించి ఆరాతీశారు. ‘కలిసి పనిచేద్దాం.. సిద్ధంగా ఉండు.. త్వరలో మళ్లీ కలుద్దాం..’ అంటూ కేటీఆర్‌ డాక్టర్‌ ఆనంద్‌కు సూచించారు. ఇదిలా ఉంటే, మోమిన్‌పేట మండల కేంద్రానికి చెందిన డాక్టర్‌ తుప్ప ఆనంద్‌ ఈ ఎన్నికల్లో వికారాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. అధికారపార్టీ చాలా వరకు సిట్టింగులకే టిక్కెట్‌ ఖరారు చేయడంతో ఆయన తన అభ్యర్థనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం లభించలేదు. ఇదిలా ఉంటే, ఎన్నికల ప్రచారం జోరందుకున్న ఈ సమయంలో ప్రగతి భవన్‌ నుంచి డాక్టర్‌ తుప్ప ఆనంద్‌కు పిలుపురావడం వెనుక ఆంతర్యమేమిటనేది అధికార పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-10-30T23:54:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising