ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వికారాబాద్‌లో పట్టు సాధించిన కాంగ్రెస్‌

ABN, First Publish Date - 2023-12-05T23:33:39+05:30

వికారాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టు సాధించింది. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ గెలుపులో స్థానిక పార్టీ నేతలు కీలక పాత్ర పోషించారు.

ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతున్న రాజశేఖర్‌ రెడ్డి, చిత్రంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌(ఫైల్‌)

  • 28 బూత్‌లలో కలిపి 3300 లీడ్‌

  • అన్నీ తానై నడిపించిన మండల అధ్యక్షుడు

వికారాబాద్‌, డిసెంబరు 5: వికారాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టు సాధించింది. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ గెలుపులో స్థానిక పార్టీ నేతలు కీలక పాత్ర పోషించారు. వికారాబాద్‌ మండలంలో 28 బూత్‌లలో కలిపి ఏకంగా 3300 లీడ్‌ రావడంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి కీలక పాత్ర పోషించడమనే చెప్పవచ్చు. పార్టీ నుంచి చివరి నిమిషంలో ఎంపీపీ కామిడి చంద్రకళ పార్టీ వీడిన క్రమంలో మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు. మండలంలోని అన్నిగ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలను గడప గడపకు తీసుకెళ్లడంలో విజయం సాధించారు. మాజీ మంత్రి ప్రసాద్‌ కుమార్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి మండలంలో కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ తీసుకురావడం పట్ల పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్‌ రెడ్డి గతంలో యూత్‌ కాంగ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రసాద్‌ కుమార్‌ 12,672 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీతో పోలిస్తే వికారాబాద్‌ మండలం నుంచే ఎక్కువ మెజార్టీ కాంగ్రెస్‌ పార్టీకి వరించింది.

Updated Date - 2023-12-05T23:33:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising