ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అదనపు బ్యాలెట్‌ యూనిట్ల ర్యాండమైజేషన్‌ పూర్తి

ABN, First Publish Date - 2023-11-22T00:02:17+05:30

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొదటి విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ, అదనపు బ్యాలెట్‌ యూనిట్ల పరిశీలన పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌పోట్రు తెలిపారు.

వీవీ ప్యాట్లను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌

జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌ పోట్రు

మేడ్చల్‌ నవంబరు 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొదటి విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ, అదనపు బ్యాలెట్‌ యూనిట్ల పరిశీలన పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌పోట్రు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, డీఆర్‌ఓ హరిప్రియలతో పాటు జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతిధులతో కలిసి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజిగిరి, ఉప్పల్‌ నియోజకవర్గాలకు అదనంగా బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌యూనిట్లు అవసరం కాగా అందులో మల్కాజిగిరి నియోజకవర్గానికి బ్యాలెట్‌ యూనిట్లు 1,096, కంట్రోల్‌ యూనిట్లు 23చొప్పున, ఉప్పల్‌ నియోజకవర్గానికి బ్యాలెట్‌ యూనిట్లు 1060, కంట్రోల్‌ యూనిట్లు 15 కేటాయించినట్లు వివరించారు. అనంతరం కలెక్టరేట్‌లో అదనపు బ్యాలెట్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లను జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు.

Updated Date - 2023-11-22T00:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising