గణితశాస్త్రంలో రామానుజన విశేష కృషి
ABN, Publish Date - Dec 22 , 2023 | 11:26 PM
గణిత శాస్త్రంలో శ్రీనివాసరామానుజన విశేషంగా కృషి చేశారని గణిత ఫోరం జిల్లా అధ్యక్షుడు అద్దంకి సునీల్‌కుమార్ అన్నారు.
హాలియా, డిసెంబరు 22 : గణిత శాస్త్రంలో శ్రీనివాసరామానుజన విశేషంగా కృషి చేశారని గణిత ఫోరం జిల్లా అధ్యక్షుడు అద్దంకి సునీల్‌కుమార్ అన్నారు. శుక్రవారం జాతీయ గణిత దినోత్సవాన్ని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల, ఎంఆర్సీలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శుద్ధ గణితంలో రామానుజన శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అవిరామ భిన్నాలు వంటి గణిత విభాగాల్లో విశేషమైన కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కరిమలు వెంకటరమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా పేరూరు పాఠశాలలో రామానుజన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హాలియా పట్టణంలోని టైం పాఠశాలలో ప్రధానోపాఽఽధ్యాయులు కత్తి కోటిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ టౌన: పట్టణంలోని శ్రీసాయిటెక్నో పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంఈవో బాలాజీనాయక్, వేదపండితులు లోకాచారి, కరస్పాండెంట్ కందాల శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. అదేవిధంగా శివానీ ఉన్నత పాఠశాలలో ఎనబీఆర్ ఫౌండేషన వ్యవస్థాపకులు నల్లమోతు సిద్ధార్థ మాథ్య్ ఫెయిర్‌ను ఎంఈవో బాలాజీనాయక్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన కుందూరు శ్యాంసుందర్‌రెడ్డి, వీరకోటిరెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఆదిత్య పాఠశాలలో కరస్పాండెంట్ మారుతీ అమరేందర్‌రెడ్డి, కట్టా అనిత, నాగరాజు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ అర్బన : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.ధర్మానాయక్ విద్యార్థులకు గణితశాస్త్రం ప్రాముఖ్యాన్ని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రామానుజన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచఎం చేరుపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చిట్యాల రూరల్ : మండలంలోని నేరడ ఉన్నత పాఠశాలలో రామానుజన గొప్పతనాన్ని ఉపాధ్యాయులు వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రామ్మోహన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెద్దవూర : మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులు మాథ్స్ 1729 అనే అలంకరణలో కూర్చుని అలరించారు. కార్యక్రమంలో హెచఎం బాలాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వేములపల్లి : మండలంలోని రావులపెంట ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్‌నాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ : పట్టణంలోని సాగర్ హిల్‌కాలనీ, పైలానకాలనీల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో రామానుజన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏటీసీ రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2023 | 11:26 PM