Kumaram Bheem Asifabad: ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ABN, Publish Date - Dec 26 , 2023 | 10:05 PM
గ్రామ పంచాయతీలు, మున్సిపాలి టీలలో ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు
ఆసిఫాబాద్, డిసెంబరు 26: గ్రామ పంచాయతీలు, మున్సిపాలి టీలలో ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్‌డీవో కదం సురేష్, కాసబోయిన సురేష్‌తో కలసి జిల్లా అధికారులు, తహసీల్దార్‌లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, నాయబ్ తహసీల్దార్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు జిల్లాలోని గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులందరు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలు చేయడం కోసం మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిర్మ ఇళ్లు, చేయూత పథకాల పై దరఖా స్తులు స్వీకరించాలని సూచించారు. గ్రామపంచాయతీ, మున్సిపాలి టీలలో దరఖాస్తుల స్వీకరణ కోసం కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో రెండు బృం దాలను ఏర్పాటు చేసి రెండు బదిలీల వారీగా గ్రామసభలు నిర్వహిం చాల న్నారు. ప్రతి బృందంలో పది మంది అధికారులు ఉంటారని తెలి పారు. దరఖాస్తుల స్వీకరణకు ముందు రోజు గ్రామాల్లో చాటింపు ద్వారా ప్రజలందరికి తెలియజేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
Updated Date - Dec 26 , 2023 | 10:05 PM