ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ponguleti Srinivas: నిరంకుశ పాలనకు.. ఇందిరమ్మ రాజ్యానికి జరుగుతున్న యుద్ధం: పొంగులేటి

ABN, First Publish Date - 2023-11-19T15:47:45+05:30

రానున్న అసెంబ్లీ ఎన్నికలు నిరంకుశ బీఆర్ఎస్ పాలనకు.. ఇందిరమ్మ రాజ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas) విమర్శించారు.

పాలేరు: రానున్న అసెంబ్లీ ఎన్నికలు నిరంకుశ బీఆర్ఎస్ పాలనకు.. ఇందిరమ్మ రాజ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas) విమర్శించారు. కూసుమంచి మండలం పాలేరు(Paleru)లో ఎన్నికల ప్రచారంలో పొంగులేటి మాట్లాడుతూ.. "తెలంగాణ వచ్చాక రాజభోగాలు అనుభవిస్తోంది సీఎం కేసీఆర్ కుటుంబం. ప్రజల సొమ్ము దోచుకోవాలని కేసీఆర్ కోసం తెలంగాణ ఇవ్వలేదు. రానున్న ఎన్నికలు నిరంకుశ పాలనకు, ఇందిరమ్మ రాజ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధంలాంటివి. వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల(YS Sharmila) స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం శుభపరిణామం. సీపీఐ కూడా 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్(Congress)కు మద్దతు ఇస్తోంది.

కాళేశ్వరం లాంటి ఇంజినీరింగ్ ఫెయిల్యూర్ ప్రాజెక్టు కట్టి రూ.వేల కోట్లు వృథా చేశారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ ఎంత ధృడంగా ఉన్నాయో చూడండి. అవన్ని మర్చిపోయి.. కాంగ్రెస్ ని విమర్శించే స్థాయి సీఎం కేసీఆర్ కు(CM KCR) లేదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కలిసిపోయాయి. లేదంటే కేసీఆర్ ను కేంద్రం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు. రూ.లక్ష కోట్ల అవినీతిలో బీజేపీ వాటా ఎంత?" అని ప్రశ్నించారు.

Updated Date - 2023-11-19T15:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising