ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలి

ABN, Publish Date - Dec 22 , 2023 | 11:48 PM

హరితహారంలో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హొలికేరీ అన్నారు. హరితహారం భవిష్యత్‌ కార్యాచరణపై సంబంధిత శాఖాధికారులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న భారతిహొలికేరీ

రంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 22 : హరితహారంలో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హొలికేరీ అన్నారు. హరితహారం భవిష్యత్‌ కార్యాచరణపై సంబంధిత శాఖాధికారులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024, 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. మొక్కలు నాటేందుకు స్థలాల గుర్తింపు, గుంతల తవ్వకం చేపట్టాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్‌ చేయాలని కలెక్టర్‌ భారతి హొలికేరీ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో పరిశ్రమల శాఖ కమిటీ, టీఎస్‌ ఐపాస్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు ఇచ్చే పథకాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 11:48 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising