ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీఎం, మంత్రులను కలిసిన పేట ఎమ్మెల్యే

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:09 PM

నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌ రెడ్డి, ఐఏఎస్‌ చిట్టెం లక్ష్మీ సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభా కాంక్షలు తెలిపారు.

సీఎంకు వినతిపత్రాన్ని ఇస్తున్న ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి, చిత్రంలో శివకుమార్‌ రెడ్డి

నారాయణపేట, డిసెంబరు 18: నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌ రెడ్డి, ఐఏఎస్‌ చిట్టెం లక్ష్మీ సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభా కాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా కొత్తగా గార్లపాడ్‌, కోటకొండ, కాన్‌ కూర్తిలను నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి పత్రాన్ని అందించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో జీఓ 69 గురించి పూర్తి వివరాలకు వెల్లడించడం పట్ల ఎమ్మెల్యే సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. జీఓ 69 పనులను వెంటనే ప్రారంభించాలని, నియోజక వర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి సహకరించాలని ఎమ్మెల్యే సీఎంను కోరారు. అనంతరం రాష్ట్ర బీసీ వెల్ఫేర్‌ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృ ష్ణారావులను ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జిలు మర్యాద పూర్వకంగా కలిసి బొకేలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Dec 18 , 2023 | 11:09 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising