ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉపాధి హమీ కింద పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు

ABN, Publish Date - Dec 30 , 2023 | 03:31 AM

ఉపాధి హామీ పథకం కింద ఫామ్‌పాండ్స్‌, ఫిష్‌ పాండ్స్‌, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, మహిళా భవనాల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనుసూయ సీతక్క అధికారులను ఆదేశించారు.

నిర్మాణ పనులకు కార్యాచరణ సిద్ధం చెయ్యండి

అధికారులతో సమీక్షలో మంత్రి సీతక్క

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం కింద ఫామ్‌పాండ్స్‌, ఫిష్‌ పాండ్స్‌, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, మహిళా భవనాల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనుసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గత ప్రభుత్వం రూ.800 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు సచివాలయంలోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో శుక్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే కొత్త పథకాల రూపకల్పనకు సలహాలు ఇవ్వాలని కోరారు. రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న గ్రామీణాభివృద్ధి అధికారుల వేతనాల చెల్లింపు కోసం రూ.46 కోట్లు విడుదల చేయాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 03:31 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising