ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పల్లవి ప్రశాంత్‌కు రిమాండ్‌

ABN, Publish Date - Dec 22 , 2023 | 03:56 AM

బిగ్‌బాస్‌ సీజన్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌, అతని సోదరుడు మనోహర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

చంచల్‌గూడ జైలుకు తరలింపు.. బెయిల్‌కు దరఖాస్తు

బస్సు అద్దాలు పగులగొట్టిన 16 మందిలో 12 మంది జైలుకు

బిగ్‌బాస్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి: సీజేకు నారాయణ లేఖ

బంజారాహిల్స్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బిగ్‌బాస్‌ సీజన్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌, అతని సోదరుడు మనోహర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతోపాటు.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ వీరిద్దరిపూ జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే..! బుధవారం సాయంత్రం వీరిని గజ్వేల్‌లో అరెస్టు చేశారు. ఆ వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. అర్ధరాత్రి దాటాక ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. కాగా.. బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఫైనల్స్‌ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో వద్ద విధ్వంసానికి పాల్పడి.. ఆరు ఆర్టీసీ బస్సులు, రెండు ప్రైవేటు వాహనాల అద్దాలను ధ్వంసం చేసిన కేసులో 16 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఇందిరానగర్‌కు చెందిన భూపతి బాలకృష్ణ, జి.మోహన్‌కుమార్‌, భూపతి రాఘవేంద్ర, డి.రంజిత్‌, యేసురత్నం, ఐ.మల్లేశ్‌, జవహర్‌నగర్‌కు చెందిన గణేశ్‌, రాఘవ, శ్రీనగర్‌కాలనీకి చెందిన సురేందర్‌, ఎల్లారెడ్డిగూడ వడ్డెరబస్తీకి చెందిన ఆర్‌.నవీన్‌, సికింద్రాబాద్‌కు చెందిన ఎ.సంతో్‌షలను అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. వీరిలో నలుగురు మైనర్లను జువెనైల్‌ కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. మిగతా నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

బెయిల్‌పై తీర్పు రేపటికి వాయిదా

ప్రశాంత్‌ బెయిల్‌ కోసం ఆయన తరఫున న్యాయవాది శ్రీనాథ్‌ గురువారం నాంపల్లిలోని 17వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్న సెక్షన్ల ప్రకారం.. సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా.. ఆ నిబంధనను పాటించలేదని వాదించారు. ఏడేళ్లకు పైన శిక్ష పడే కేసులో మాత్రమే అరెస్టు చేయాలని నిబంధనలు చెబుతున్నా.. పోలీసులు అత్యుత్సాహంతో ప్రశాంత్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఈ వాదనలను ఖండించారు. ఏడేళ్ల కంటే తక్కువ కాలం శిక్ష పడే సెక్షన్లే ఉన్నా.. పోలీసుల సమక్షంలోనే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగిందని గుర్తుచేశారు. అన్నపూర్ణ స్టూడియో నుంచి ప్రశాంత్‌ను పంపించినా.. పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా ప్రశాంత్‌ మరోమారు అక్కడికి వచ్చారని చెప్పారు. దీనివల్లే అల్లరి మూకలు రెచ్చిపోయి, వాహనాలను ధ్వంసం చేశాయని వివరించారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న కోర్టు.. తీర్పును శనివారానికి వాయిదా వేసింది. కాగా.. బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం ఓ లేఖ రాశారు.

Updated Date - Dec 22 , 2023 | 03:56 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising