ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘కంకల్‌ మండల కేంద్రం’ హామీ ఇస్తేనే ప్రచారానికి రావాలిOnly if 'Kankal Mandal Kendra' guarantees

ABN, First Publish Date - 2023-11-20T23:47:38+05:30

ఎన్నికల వేళ కంకల్‌ గ్రామస్తులు తమ డిమాండ్‌ను అభ్యర్థుల ముందు పెట్టారు. ఏకంగా ఫ్లెక్సీ తయారు చేయించి గ్రామంలో ఏర్పాటు చేశారు.

కంకల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

హామీ ఇవ్వని వారికి ఓట్లు వేయం : కంకల్‌ గ్రామస్తులు

పూడూరు, నవంబరు 20 : ఎన్నికల వేళ కంకల్‌ గ్రామస్తులు తమ డిమాండ్‌ను అభ్యర్థుల ముందు పెట్టారు. ఏకంగా ఫ్లెక్సీ తయారు చేయించి గ్రామంలో ఏర్పాటు చేశారు. ఏ పార్టీ అభ్యర్థులైన తమ గ్రామంలో ప్రచారం చేయాలంటే తమకు మాటివ్వాలని డిమాండ్‌ను ముందుంచారు. కంకల్‌ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని గ్రామస్తులు కొంతకాలంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకుంటున్నారు. దీక్షలు చేపట్టారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు తమకు హామీ ఇస్తేనే ప్రచారం చేసేందుకు గ్రామానికి రావాలని, లేదంటే ఓట్లు వేయమని బహిరంగంగానే చెబుతున్నారు. ప్రస్తుత అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటంతో కంకల్‌ గ్రామస్తులు తమ గ్రామంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ‘తెలంగాణ అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులకు విన్నపం.. కంకల్‌ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి, ఇదే మా మొదటి డిమాండ్‌..దీనికి కట్టుబడి ఉంటేనే గ్రామానికి వచ్చి ప్రచారం నిర్వహించండి’ అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. తమకు ఎవరు అనుకూలంగా స్పందిస్తారో వారే తమ గ్రామంలో ప్రచారం నిర్వహించాలని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా స్పందించని పార్టీలకు ఓట్లు వేయొద్దని పులుపునిచ్చారు.

Updated Date - 2023-11-20T23:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising