ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Farmer Protest: కామారెడ్డి రైతుల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ మద్దతు

ABN, First Publish Date - 2023-01-06T11:02:19+05:30

కామారెడ్డి నూతన మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతుల చేపట్టిన ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ పార్టీలు మద్దతు తెలిపాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: కామారెడ్డి నూతన మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతుల చేపట్టిన ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డికి రానున్నారు. అడ్లూరు ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని బండి పరామర్శించనున్నారు. అలాగే కాంగ్రెస్ నేతలు రెండు బృందాలుగా కామారెడ్డికి రానున్నారు. కిసాన్ కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డిల నేతృత్వంలో మరో బృందం కామారెడ్డికి బయలుదేరింది. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్‌తో పాటు సీనియర్ నాయకులతో మరో బృందం కామారెడ్డికి రానుంది.

కాగా... కామారెడ్డిలో కొత్త మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా జిల్లాలో బంద్ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా అఖిలపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. అటు వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి అఖిలపక్ష నాయకుల ఇంటి ముందు పోలీసులు మోహరించారు. రైతు జేఏసీకి కామారెడ్డి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా మద్దతు పలుకుతున్నాయి.

Updated Date - 2023-01-06T11:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising