ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రతి జిల్లాలో నీరా ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:16 AM

ప్రతీ జిల్లాలో నీరా ప్రా జెక్టులను ఏర్పాటు చేయాలని గీత పనివారల సంఘం రాష్ట్ర నా యకుడు పబ్బు వీరస్వామి డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న పబ్బు వీరస్వామి

ప్రతి జిల్లాలో నీరా ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి

నల్లగొండటౌన, డిసెంబరు 27: ప్రతీ జిల్లాలో నీరా ప్రా జెక్టులను ఏర్పాటు చేయాలని గీత పనివారల సంఘం రాష్ట్ర నా యకుడు పబ్బు వీరస్వామి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని సీ పీఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా గీత పనివారల సంఘం కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడా రు. గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వేయి కోట్లతో సం క్షేమ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వృత్తిని న మ్ముకొని జీవనోపాధి చేస్తున్న గీత కార్మికుడు ప్రమాదవశాత్తు చెట్ల నుంచి పడితే పాత పద్ధతితో మెడికల్‌ సర్టిఫికెట్‌ ద్వారానే పర్మినెంట్‌ ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గీత సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడిగె సైదులు మాట్లాడుతూ అర్హులైన గీత కార్మికులకు వృత్తి పింఛన మంజూరు చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గీత కార్మికుడికి చెట్టు ఎక్కేందుకు యంత్రాలను అందజేయాలని, గీతవృత్తికి సమగ్రచట్టం కల్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న సొసైటీ, టీఎఫ్టీలకు లైసెన్సులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. గ్రామాల్లో బెల్టు షాపులను రద్దు చేయాలన్నారు. ప్రతీ గీత కార్మికునికి ద్విచక్ర వాహనాన్ని మంజూరు చేయాలని అన్నారు. తాటి, ఈత వనాలపై గీత కార్మిక సొసైటీలకు చెట్టు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం నాయకులు చింతపల్లి పుల్లయ్య, కుంభం జయరాములు, వనం వెంకన్న, ఎరుకల నిరంజన, దోతి పాండరి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:16 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising