కస్టమ్ మిల్లింగ్‌పై కొరడా
ABN, Publish Date - Dec 28 , 2023 | 12:22 AM
పౌరసరఫరాలశాఖను ప్రక్షాళన చేస్తామని, పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం నల్లగొండలో స్పష్టం చేయగా, బుధవారం ఉదయం నుంచే రైస్‌మిల్లుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలు ప్రారంభమయ్యాయి.
మూడు మిల్లుల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
ఉమ్మడి జిల్లాలో లక్షటన్నుల మేర సీఎంఆర్ బకాయిలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిఽధి,నల్లగొండ): పౌరసరఫరాలశాఖను ప్రక్షాళన చేస్తామని, పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం నల్లగొండలో స్పష్టం చేయగా, బుధవారం ఉదయం నుంచే రైస్‌మిల్లుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ పట్ణణం, మండల పరిధిలో రెండు మిల్లులతోపాటు హాలియా మండల పరిధిలోని బడా మిల్లుల్లో తనిఖీలు ప్రా రంభయ్యాయి. టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు ప్రారంభించిన అనంతరం సివిల్ సప్లయ్స్ అధికారులను పిలిచి ధాన్యం నిల్వలను లెక్కలు తేల్చేపనిలో పడ్డారు.
ఉమ్మడి జిల్లాలో లక్షటన్నుల మేర సీఎంఆర్ బకాయిలు ఉన్యాయి. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా బకాయిలు ఉన్నాయి. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని మిల్లులు పూర్తిగా సన్నబియ్యంపైనే ఆధారపడి ఓపెన్ మార్కెట్‌లో వ్యాపారం చేస్తతంటా యి. అలాంటి మిల్లులు సీఎంఆర్ కోటా కింద ప్రభుత్వం నుంచి ధాన్యం సేకరించి ఇతర ప్రాంతాల్లో ని మిల్లులో భద్రపరిచినట్టు సమాచారం. గత యాసంగికి సంబంధించి న సీఎంఆర్ బియ్యం మిల్లర్లు ఓపెన్ మార్కెట్‌లో విక్రయించాని, ఆ ధాన్యం నిల్వలను భర్తీ చేసేందుకు తాజా వానాకాలంలో రైతుల నుంచి ధాన్యం సేకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా సీఎంఆర్ ధాన్యాన్ని కొందరు మిల్లర్లు బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్‌లో వ్యాపారం చేసుకోవడం, కొందరు ఉచితంగా తీసుకున్న ధాన్యాన్ని బ్యాంకుల్లో కుదవపెట్టి రుణాలు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.
సీఎంఆర్ అప్పగింతలో తీవ్ర జాప్యం
ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అప్పగించడంలో కొన్ని మిల్లులు తీవ్రంగా జాప్యం చేస్తున్నాయి. 2022-23లో వానాకాలం సీజన్ కు సంబంధించి ఈనెల 31 వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మిల్లులు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం కేటాయింపులు ఆధారంగా బియ్యా న్ని ప్రభుత్వాని తిరిగి అప్పగించాలి. కానీ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో ఇంకా లక్ష టన్నుల బియ్యం బకాయి ఉన్నట్లు సమాచారం. రోజుల వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో బకాయి ఉన్న బియ్యాన్ని ప్రభుత్వానికి ఏమేరకు అప్పగిస్తారనే దానిపై చర్చ సాగుతోంది. యాదాద్రి, నల్లగొండ జిల్లాలో సీఎంఆర్ అప్పగింత సుమారు 90శాతం పూర్తికాగా, సూర్యాపేట జిల్లాలో 70శాతం మాత్రమే పూర్తి కావడం గమనార్హం. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లర్లకు సైతం ధాన్యం కేటాయింపులు జరగ్గా, ప్రస్తుతం బకాయిలు ఉన్న వారిలో వీరే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. సంబంధిత మిల్లులకు బకాయిలను సకాలంలో చెల్లించాలని నోటీసులు ఇచ్చినా వారు స్పందించడం లేదని తెలిసింది. వీరంతా పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు చెందిన వారే కావడంతో సీఎంఆర్ బకాయిలపై మూడు జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
యాసంగి సీజన్‌లోనూ అరకొరే
2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ అప్పగింత సైతం అరకొరగానే ఉంది. ప్రభుత్వానికి బియ్యం అప్పగించడంలో మిల్లర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. యాసంగి సీజన్‌లో అత్యధికంగా యాదాద్రిలో 25శాతం పూర్తికాగా, నల్లగొండ జిల్లాలో 23శాతం, సూర్యాపేట జిల్లాలో కేవలం 5 శాతం మాత్రమే పూర్తయింది. సూర్యాపేట జిల్లాలో గత సీజన్‌లో సీఎంఆర్ అప్పగింతలో అలసత్వంపై అధికారులు మిల్లర్లతో ప్రత్యేక సమావేశమై గడువులోగా బియ్యాన్ని అప్పగించాలని ఆదేశించారు. రెండు నెలలుగా అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో బియ్యం అప్పగింతలో కొంత ఆలస్యమైందని సమాచారం. మరోవైపు రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించే బదులు వేలం వేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. నూతన ప్రభుత్వం ఈ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేస్తారో అని మిల్లర్లలో చర్చ సాగుతోంది. 2022-23 సీజన్‌లో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుదిదశకు చేరగా, మిల్లులకు ధాన్యం కేటాయింపు సైతం పూర్తయింది. గత సీజన్‌లోనే పెండింగ్‌లో ఉండటంతో చాలా మి ల్లుల్లో నిల్వల కు స్థలం లేదు.
బియ్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్న మిల్లర్లు
రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి న ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ లేకుండానే మిల్లర్లకు అప్పగించి బియ్యం తీసుకుంటుంది. దీంతో కొంత మంది మిల్లర్లు బియ్యాన్ని మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఈ ధాన్యాన్నే ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ధరకు విక్రయించినట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీతోనే ధాన్యం అప్పగించాలని ప్రతిపాదనలు రూ పొందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై స్పష్టత లేదు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ సమక్షంలో సమీక్ష అనంతరమే బ్యాంకుల గ్యారంటీలపై స్పష్టత రానుం ది. మరోవైపు మిల్లులు బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ధాన్యం కేటాయించే అంశంపై మిల్లర్ల ప్రతినిధులు సైతం సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇది జరిగితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని, మిల్లర్లకు,అధికారులకు జవాబుదారీతనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ధాన్యం నిల్వలపై ఆరా
మిల్లుల్లో స్టాక్‌ను పరిశీలిస్తున్న అధికారులు
యాదాద్రి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రైస్‌మిల్లుల్లో ధా న్యం నిల్వలపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తోంది. జిల్లాలో వానాకాలంలో 2.83మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. ఈ ధాన్యాన్ని మిల్లర్లకు సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద అప్పగించింది. వానాకాలంలో మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ బియ్యం ఇప్పటివరకు పలువురు మిల్లర్లు ఎఫ్‌సీఐ, పౌరసరఫరాలశాఖకు అప్పగించలేదు. ఈ నేపథ్యంలో మిల్లుల్లో ధాన్యం స్టాక్‌లో భారీ తేడా ఉన్నట్టు ఇటీవల పౌరసరఫరాలశాఖ నిర్వహించిన తనిఖీల్లో అధికారులు గుర్తించారు. దీంతో జిల్లాస్థాయిలో సమీక్షించి, బకాయిలు ఉన్న మిల్లుల్లో తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాయంత్రాంగం సీఎంఆర్‌పై దృష్టి సారించింది. జిల్లాలో మొత్తం 47 రైస్ మిల్లులు ఉన్నాయి. వానాకాలంలో సీఎంఆర్ బియ్యం ఇప్పటివరకు 94శాతం మేరకు ఎఫ్‌సీఐకి చేరింది. మ రో 6శాతం అంటే సుమారు 12వేల మెట్రిక్ టన్నుల వరకు బియ్యం అప్పగించాల్సి ఉంది. ప్రభుత్వం వానాకాలం, యాసంగిలో మిల్లర్లకు కేటాయించిన ధాన్యం మిల్లుల్లో ఉందా? ఎంత మేరకు పెండింగ్‌లో ఉంది? అనే పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. బుధవా రం బీబీనగర్ మండలం భట్టుగూడెంలోని కాదంబరి మిల్లులో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీఎ్‌సడీవో శ్రీనివా్‌సరెడ్డి, పౌరసరఫరాలశాఖ డీఎం గోపికృష్ణ, తదితరులు తనిఖీలు నిర్వహించారు. ఎంత సీఎంఆర్ పెండింగ్‌లో ఉందని పరిశీలించారు. గురువారం సైతం ఈ తనిఖీలు కొనసాగనున్నాయి. సీఎంఆర్ పెండింగ్‌లో ఉంటే వెంటనే నోటీసులు ఇచ్చేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రైస్ మిల్లుల్లో అధికారుల తనిఖీలతో మిల్లర్లలో అలజడి నెలకొంది.
2022-23 వానాకాలం, యాసంగి సీజన్‌కు సంబంధించి ఈనెల 15వ తేదీ వరకు సీఎంఆర్ అప్పగింత ఇలా..
జిల్లా సీజన్ లక్ష్యం అప్పగించింది బకాయి
(మెట్రిక్ టన్నుల్లో)
నల్లగొండ వానాకాలం 2,98,723 2,80,865 17,858
యాసంగి 4,64,837 1,07,184 3,57,653
సూర్యాపేట వానాకాలం 2,22,274 1,43,858 78,416
యాసంగి 2,42,359 12,251 2,30,108
యాదాద్రి వానాకాలం 1,91,750 1,69,254 22,496
యాసంగి 2,76,299 69,629 2,06,670
మొత్తం వానాకాలం 7,12,747 5,93,977 1,18,770
యాసంగి 9,83,495 1,89,064 7,94,431
రెండు సీజన్లు కలిపి 16,96,242 7,83,041 9,13,201
Updated Date - Dec 28 , 2023 | 12:22 AM