ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ రాజీనామా చేయాలి

ABN, Publish Date - Dec 23 , 2023 | 12:01 AM

యాద్రాది దేవస్థాన ఈవో గీతారెడ్డి ఒక్క రే రాజీనామా చేయడం సరికాదని, వైటీడీఏ చైర్మన్‌, మాజీ సీఎం కేసీఆర్‌, వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు రాజీనామా చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్‌చేశారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు

యాదగిరిగుట్ట రూరల్‌, డిసెంబరు 22: యాద్రాది దేవస్థాన ఈవో గీతారెడ్డి ఒక్క రే రాజీనామా చేయడం సరికాదని, వైటీడీఏ చైర్మన్‌, మాజీ సీఎం కేసీఆర్‌, వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు రాజీనామా చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్‌చేశారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాద్రాది అభివృద్ధి పనులకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎన్ని ఖర్చు చేశారని, స్వామి వారికి దాతల నుంచి విరాళాలు ఎన్ని వచ్చాయని, నగదు మొత్తం వివరాలు చెప్పి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆ తర్వాతే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి యాదగిరిగుట్ట మీద దృష్టి సారించి అభివృద్ధి పనులను సమీక్షించాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, జిల్లా సమితి సభ్యులు బబ్బూరి శ్రీధర్‌, మండ ల కార్యదర్శి కల్లెపల్లి మహేందర్‌, సహాయ కార్యదర్శి పేరబోయిన మహేందర్‌, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, నాయకులు రాగిరు బాలకృష్ణ, మునిసిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, పాకలపాటి రాజు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising