ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కమనీయంగా సుంకిశాల వేంకటేశ్వరుడి కల్యాణం

ABN, First Publish Date - 2023-12-11T00:08:15+05:30

మండలంలోని సుంకిశాల గ్రా మంలోని శ్రీ వేంకటేశుడి కల్యాణ వేడుకలు ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో కల్యాణ వేడుకలు కొనసాగాయి. ఆలయం నుంచి ముత్యాల పల్లకిలో భక్తుల గోవింద నామస్మరణ నడుమ కల్యాణ మండపం వద్దకు గోవిందుడిని తోడ్కొని వచ్చారు.

వలిగొండ, డిసెంబరు 10: మండలంలోని సుంకిశాల గ్రా మంలోని శ్రీ వేంకటేశుడి కల్యాణ వేడుకలు ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో కల్యాణ వేడుకలు కొనసాగాయి. ఆలయం నుంచి ముత్యాల పల్లకిలో భక్తుల గోవింద నామస్మరణ నడుమ కల్యాణ మండపం వద్దకు గోవిందుడిని తోడ్కొని వచ్చారు. పచ్చని మామిడి తోరణాలు, పలురకాల పుష్పాలతో అలంకరించిన కల్యాణ వేదికపై పద్మావతి, అలివేలు మంగ సమేత స్వామివారిని అధిష్ఠింపజేసి వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణ తంతు సాగింది. విశ్వశాంతికోసం నిర్వహిస్తున్న స్వామివారి కల్యాణంలో సంప్రదాయం గా విశ్వక్సేనుడికి ఆది పూజలతో ఆరంభించారు. పాదప్రక్షాళన చేసిన అనంతరం కల్యాణతంతు నిర్వహించారు. ఈ వైదిక పర్వాలను యజ్ఞాచార్యులు అరుణ్‌కుమారాచార్యులు, దేవస్థాన ప్రధానార్చకుడు సంతో్‌షకుమారాచార్యులు, తదితరులు నిర్వహించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, మాంగల్యాన్ని పైళ్ల సంజీవరెడ్డి, మనోహరమ్మ దంపతులు అందజేశారు.

అమ్మవారికి బోనాల సమర్పణ

వేంకటేశ్వరస్వామి దేవాలయంలో కొలువుదీరిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి గ్రామస్థులు బోనాలు సమర్పించారు. మహిళా భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యాన్ని సమర్పించ గా, శివసత్తులు పూనకాలతో ఊగారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దర్శనాల కోసం క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులతో ఆలయ వీధులు కిటకిటలాడాయి. శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్లు కల్యాణ వేడుకల్లో సేవలు అందించారు.

స్వామివారి సేవలో ప్రముఖులు

వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి,ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ నూతి ర మే్‌షరాజు, జడ్పీటీసీ వాకిటి పద్మ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌ నర్సింహ, నాయకులు పాశం సత్తిరెడ్డి, బోళ్ల లలితా శ్రీనివాస్‌, శివయ్య, యుగేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:08:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising