ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలుచేయాలి
ABN, Publish Date - Dec 29 , 2023 | 12:33 AM
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయాలని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని యాద్గార్‌పల్లిలో గురువారం నిర్వహించిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
మిర్యాలగూడ, డిసెంబరు 28: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయాలని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని యాద్గార్‌పల్లిలో గురువారం నిర్వహించిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. అమరుల బలిదానాలతో ఎరుపెక్కిన ఎర్రజెండా ఎత్తిపట్టి ఎంసీపీఐ(యు), ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతోందన్నారు. ఓంకార్, భీంరెడ్డి నర్సింహారెడ్డి ఆశయసాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ప్రత్యామ్నాయం కోసం కృషి చేయాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వస్కుల మట్టయ్య, జిల్లా కార్యదర్శి వస్కుల సైదమ్మ, నాయకులు గోపి, మోహన్‌నాయక్, జ్యోతి, ఆశీర్వాదం, బాబు వీరయ్య, ఆమని, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 29 , 2023 | 12:33 AM