ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బుద్ధవనంలో వైభవంగా బుద్ధ ధాతువు ప్రతిష్ఠాపన

ABN, First Publish Date - 2023-10-30T01:07:57+05:30

నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని బుద్ధవనంలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా బుద్ధ ధాతువును ఆదివారం ప్రతిష్ఠించారు. గగన్‌ మాలిక్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇండోనేషియా నుంచి తెప్పించిన బుద్ధ ధాతువుతో పాటు ఆయన శిష్యులైన సారీ పుత్ర, మెగ్గలాన, శివాలి, అనిరుద్ధ, బకుల, ఉపాలి, ఆనంద, మయన్మార్‌కు చెందిన దగోస్‌ అనే అరహాతుల ధాతువులు కూడా నిక్షిప్తం చేసి ప్రతిష్ఠించారు.

గగన్‌మాలిక్‌ ఫౌండేషన్‌ ద్వారా సేకరించిన బుద్ధ ధాతువు

ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ కర్ణన్‌

నాగార్జునసాగర్‌, అక్టోబరు 29: నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని బుద్ధవనంలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా బుద్ధ ధాతువును ఆదివారం ప్రతిష్ఠించారు. గగన్‌ మాలిక్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇండోనేషియా నుంచి తెప్పించిన బుద్ధ ధాతువుతో పాటు ఆయన శిష్యులైన సారీ పుత్ర, మెగ్గలాన, శివాలి, అనిరుద్ధ, బకుల, ఉపాలి, ఆనంద, మయన్మార్‌కు చెందిన దగోస్‌ అనే అరహాతుల ధాతువులు కూడా నిక్షిప్తం చేసి ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బౌద్ధ భిక్షువు డాక్టర్‌ అజాన్‌ వీసీయన్‌ నేతృత్వంలో బుద్ధుని పరమ పవిత్రమైన ధాతువులను బుద్ధవనంలో ప్రతిష్ఠించామన్నారు. ముంబైకి చెందిన బాలీవుడ్‌ నటుడు గగన్‌మాలిక్‌, ఇండోనేషియాకు చెందిన బున్టారియా టిగ్రీస్‌, శీలా కుమార కోసన్‌, మిలియాన్‌, చంద్ర యానిలిల ద్వారా ఈ ఽధాతువులను సేకరించామన్నారు. ఈ ధాతువులను ప్రత్యేకంగా అలంకరించిన పగోడాలో (పల్లకిలో) కోలాటాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా మహాస్తూపం అంతర్భాగంలో మహాయాన బౌద్ధ సంప్రదాయం ప్రకారం ధాతు పూజ, బౌద్ధ ప్రార్థన నిర్వహించి ప్రతిష్ఠ చేశామన్నారు. ఈ ప్రక్రియతో బుద్ధవనం మరో ప్రత్యేకతను సంతరించుకున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో గగన్‌మాలిక్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు గగన్‌ మాలిక్‌, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రాజశేఖర టండ్రు, జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌, మహాబోధి బుద్ధ విహారకు చెందిన సంఘ పాల బిక్కు, ఇండోనేషియా, జర్మనీకి చెందిన పలువురు వలంటీర్లు, బుద్ధవనం విశ్లేషకులు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి, ఓఎ్‌సడీ సూదన్‌రెడ్డి, కేకే రాజీ, కొండా లక్ష్మీకాంత్‌రెడ్డి, విష్ణుమూర్తి, విజయవాడ బుద్ధ విహార కార్యదర్శి శుభాకార్‌, భారతీయ బౌద్ధ సంఘం అధ్యక్షుడు పరందాములు, డీఈలు దామోదర్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, ఏఈ నాజీస్‌, రాంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T01:07:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising