ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వణుకు పుట్టిస్తున్న చలి గాలులు

ABN, Publish Date - Dec 22 , 2023 | 11:56 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ను చలిగాలులు వణుకు పుట్టిస్తున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లాలో 14.4 డిగ్రీలు, యా దాద్రి జిల్లాలో 15.0 డిగ్రీలు, సూర్యాపేట జిల్లాలో 17.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిగాలుల తీవ్రతతో చిన్నారులు మొదలుకుని నడివయస్కులు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారు.

రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు

పొంచి ఉన్న కరోనాతో భయం.. భయం

నల్లగొండ,డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిఽధి): ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ను చలిగాలులు వణుకు పుట్టిస్తున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లాలో 14.4 డిగ్రీలు, యా దాద్రి జిల్లాలో 15.0 డిగ్రీలు, సూర్యాపేట జిల్లాలో 17.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిగాలుల తీవ్రతతో చిన్నారులు మొదలుకుని నడివయస్కులు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ గాలులకు దగ్గు, జ్వరం వంటివి ప్రజలను ఇబ్బందిపెడుతున్నాయి. ఆస్తమా రోగులు, గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారు అనేక అవస్థలు పడుతున్నారు.ఇక చల్లటి గాలుల నుంచి బయట పడడానికి ప్రజలు ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు. చలి గాలుల నుంచి తట్టుకునేందుకు స్వెట ్టర్లు, మంకీ క్యాపులు, హెడ్‌ప్యాడ్‌లు, గ్లౌజ్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడి గా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడంతో పాటు చల్లని పానీయాలు కూల్‌డ్రింక్‌లు, ఐష్‌క్రీమ్‌లు, చల్లటి నీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. రోజు రోజుకూ చలిగాలు ల తీవ్రత పెరుగుతుండటం, మరోవైపు కరోనా ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. చలి వాతావరణంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కరోనాను పోలి ఉండటంతో ప్రజలు ఆస్పత్రుల వైపు పరుగెత్తుతున్నారు.

పది రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా...

తేదీ గరిష్ఠం కనిష్ఠం

13 29.0 17.0

14 28.5 16.4

15 28.0 16.2

16 27.5 17.0

17 28.5 17.4

18 29.0 17.0

19 28.5 16.5

20 28.0 16.0

21 27.5 15.4

22 27.0 14.4

Updated Date - Dec 22 , 2023 | 11:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising