జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:38 AM
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా నుంచి 63 మంది బాలబాలికలు అర్హత సాధించారు. అండర్-14, 16 విభాగాల్లో ఆదివారం భువనగిరిలో నిర్వహించిన జిల్లా ఎంపిక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగిన పోటీల ను అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కోనేటి గోపాల్ ప్రారంభించి మాట్లాడారు. ఆటల్లో రాణిస్తే బహుళ ఉపయోగాలు ఉంటాయన్నారు.
అర్హత సాధించిన 63 మంది క్రీడాకారులు
భువనగిరి టౌన్, డిసెంబరు 17: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా నుంచి 63 మంది బాలబాలికలు అర్హత సాధించారు. అండర్-14, 16 విభాగాల్లో ఆదివారం భువనగిరిలో నిర్వహించిన జిల్లా ఎంపిక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగిన పోటీల ను అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కోనేటి గోపాల్ ప్రారంభించి మాట్లాడారు. ఆటల్లో రాణిస్తే బహుళ ఉపయోగాలు ఉంటాయన్నారు. జాతీయ క్రీడల్లో జిల్లా సత్తాను చాటాలన్నా రు. ప్రతిభ చూపే క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తామన్నారు. విజేతలకు బహుమతులు, పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో క్రీడాకారులు, పీఈటీలు గోనూరి శ్రీనివాస్, నక్కల సత్యనారాయణ, మాటూరి వినోద్, ఖదీరొద్దీన్, కృష్ణ, హరీష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు అర్హత సాధించిన జిల్లా క్రీడాకారులు
అండర్-16 బాలుర విభాగంలో 60 మీటర్ల పరుగు పందెంలో జీ వసంత్‌కుమార్, జి హరీష్, కె అనిల్‌కుమార్, 600 మీటర్ల పరుగు పందెంలో శ్రీనునాయక్, ఎన్ నవీన్, కె అనిల్‌కుమార్, లాంగ్ జంప్‌లో జి వసంత్‌కుమార్, ఎస్ సురేష్, ఎం నవీన్, హైజం్‌పలో ఆర్ శ్రీరాం, ఎం సాయితేజ, ఎం మనోజ్‌కుమార్, షాట్‌పుట్‌లో అన్వేష్, ఆర్ చం దు, వి శివ, జావెలెన్ త్రోలో కె శ్రీనివాస్, అన్వేష్, వి శివ, అండర్-14 విభాగంలో 60 మీటర్ల పరుగు పందెంలో మడికొండ గణేష్, రిత్విక్‌రెడ్డి, జి కార్తీక్, 600 మీటర్ల పరుగు పందెంలో మడికొండ గణేష్, జి కార్తీక్, డి ఉదయ్, లాంగ్ జంప్‌లో ఎం గణేష్, కార్తీక్‌రెడ్డి, కార్తీక్, హైజం్‌పలో పి సిద్దార్థ్, కె విజ్ఞాన్, పవన్‌కళ్యాణ్, షాట్‌పుట్‌లో ఎం అక్షయ్, ప్రదీప్, యశ్వంత్.
అండర్-16 బాలికల విభాగంలో 60 మీటర్ల పరుగు పందెంలో వి వెన్నెల, పి శిరీష, బి వరలక్ష్మీ, 600 మీటర్ల పరుగు పందెంలో వై సంజన, వి అంకిత, బి లాస్య, లాంగ్ జంప్‌లో జే శ్రావణి, వి వెన్నెల, బి వరలక్ష్మీ, హైజం్‌పలో ఎన్ పూజ, పి మనీషా, వి కీర్తి, షాట్‌పుట్‌లో శన్మిత, ఎం జయశ్రీ, ఆర్ స్వాతి, జావెలెన్ త్రోలో ఎస్ శన్విత, ఆర్ స్వాతి, జి ఐశ్వర్య, అండర్-14 విభాగంలో 60 మీటర్ల పరుగు పందెంలో రాజేశ్వరి, సంజన, వైశాలి, 600 మీటర్ల పరుగు పందెంలో సంజన, శ్రావణి, శణ్ముఖ్ ప్రియ, లాంగ్ జంప్‌లో రాజేశ్వరీ, నవనీత, అక్షయ్, షాట్‌పుట్‌లో మధుప్రియ, ఐశ్వర్య, దీపిక అర్హత సాధించారు.
ఎంజీయూ హ్యాండ్ బాల్ విజేత ఎస్‌ఎల్‌ఎన్‌ఎ్‌స కళాశాల
నల్లగొండలోని ఎంజీయూలో నిర్వహించిన అంతర్ కళాశాల హ్యాండ్ బాల్ పోటీల్లో భువనగిరిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ డీగ్రీ, పీజీ కళాశాల జట్టు విజేతగా నిలిచింది.
Updated Date - Dec 18 , 2023 | 12:38 AM