ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైతుబంధు సాయం షురూ

ABN, First Publish Date - 2023-12-13T00:28:43+05:30

రైతుబంధు పథకం కింద రైతులకు సాయం అందించాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు ఈ పథకం అమలును ఎన్నికల కమిషన్‌ నిలిపివేసిన విషయం విదితమే. మంగళవారం నుం చే రైతుల ఖాతాల్లో నగదు జమ ప్రారంభమైంది.

సంక్రాంత్రిలోగా అందరికీ

ఉమ్మడి జిల్లాలో 11.08లక్షల మంది రైతులు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): రైతుబంధు పథకం కింద రైతులకు సాయం అందించాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు ఈ పథకం అమలును ఎన్నికల కమిషన్‌ నిలిపివేసిన విషయం విదితమే. మంగళవారం నుం చే రైతుల ఖాతాల్లో నగదు జమ ప్రారంభమైంది. కాగా, ఉమ్మడి జిల్లా లో 11,08,679 మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే ఎకరాకు రూ.15వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ యాసంగికి మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే పచ్చజెండా ఊపారు. ఎకరాకు రూ.5వేలు అందించాలని నిర్ణయించారు. రైతు బంధు పథకాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించి, చేర్పు లు, మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ నిర్ణయం మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. వచ్చే వానాకాలం నుంచి రైతుబంధు సాయం ఎకరాకు రూ.15వేలు అందనుంది. జిల్లాలో మొత్తం 17మండలాల్లో 4.50 లక్షల ఎకరాలు సాగువుతున్నాయి. గత ప్రభుత్వం ప్రతీ సీజన్‌లో ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10వేలు పెట్టుబడి సాయంగా అందించింది. ఈ ఏడాది యాసంగి ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయా న్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలి. కాగా జాప్యం చోటుచేసుకోవడం, ఎన్నికల ముందు పెట్టుబడి సాయాన్ని విడుదల చేయాలని గత ప్రభు త్వం నిర్ణయించడంతో ఎన్నికల్లో లబ్ధిపొందాలనే యత్నించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో ఈ పథకాన్ని ఎన్నికల కమిషన్‌ నిలిపివేసింది. ఎన్నికలు ముగియడం, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో యాసంగికి సంబంధించిన రైతుబంధును విడుదలచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ ఏడాది 2023 యాసంగిలో జిల్లాలోని 2,71,590మంది రైతులకు రూ.304,78,45790 జమ చేయనున్నారు. నిత్యం రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ అవుతుంటాయి. ఎప్పటిలాగానే తొలుత ఎకరం భూమి ఉన్న రైతుల నుంచి ప్రారంభించి, రైతులందరీకి పెట్టుబడి సాయం జమ చేయనున్నారు.

పెరిగిన రైతుల సంఖ్య

రైతుబంధు పథకం కింద లబ్ధిదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం మొదటిసారిగా ఈ పథకాన్ని 2018 వానాకాలంలో ప్రారంభించింది. 2018లో 1,78090మంది రైతులకు రూ.204.83కోట్లు విడుదల చేయగా, ఈ ఏడాది యాసంగి నాటికి రైతుల సంఖ్య 2,71,590కి చేరి పెట్టుబడి సాయం రూ.304.78కోట్లకు పెరిగింది. ధరణి వెబ్‌సైట్‌లో నిషేధిత జాబితా(పీవోబీ)లో ఉన్న భూములకు గత ప్రభుత్వం మోక్షం కలిగించింది. ఈ వెబ్‌సైట్‌ ప్రారంభంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లోని భూములకు సంబంధించిన సర్వేనెంబర్లు పీవోబీ ఖాతాల్లో చేరాయి. ఒక సర్వేనెంబర్‌లో ఏదైనా వివాదం తలెత్తితే అదే సర్వేనెంబర్‌(బై)లోని మిగతా భూములన్నింటినీ పీవోబీలో చేర్చారు. దీంతో భూములపై రైతులకు అన్ని హక్కులు ఉన్నా, క్రయ విక్రయాలు, పేరుమార్పిడి నిలిచాయి. దీంతో రైతులు రైతుబంధుతోపాటు పలు సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఇటీవల ప్రభుత్వం ధరణిలోని పీవోబీలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ యంత్రాంగం కోర్టు కేసులు ఉన్న భూములను మినహాయించి, మిగతా వాటిని వారం రోజుల్లోగా పరిష్కరించింది. జిల్లాలో మొత్తం 284 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 264 రెవెన్యూ గ్రామాల్లోని పీవోబీ భూ సమస్యలను రెవెన్యూ అధికారులు పరిష్కరించారు. మరో 20 రెవెన్యూ గ్రామాల్లో 21వేల ఖాతాల్లో సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. గత యాసంగితో పోలిస్తే ప్రస్తుతం 10,538 మంది రైతులు పెరిగారు. రూ.9,84,5790 ఆర్థిక సాయం కూడా పెరిగింది. జిల్లాలో పట్టాదారు పాస్‌పుస్తకాల్లో భూమి తక్కువగా రావడం, సర్వేనెంబర్లు, పట్టాదారుల యజమానుల పేర్లు పొరపాటుగా ముద్రించడం వంటి తప్పిదాలు జరిగాయి. వీటిని కొత్త ప్రభుత్వం పరిష్కారిస్తే రైతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

నల్లగొండ జిల్లాలో తొలిరోజు రూ.47 కోట్లకు పైగా

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మొత్తం 5,42,089 మంది రైతులు పెట్టుబడి సాయానికి అర్హులు కాగా, రూ.624,13,37,629 రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉంది. మంగళవారం తొలి రోజు రంగారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయం ద్వారా జిల్లాలోని 1,61,612 మంది రైతుల ఖాతాల్లో రూ.47,97,50,135 జమయ్యాయి. ఇకపై వరసగా పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమకానుంది.

సూర్యాపేట జిల్లాలో 2,95,000 మంది రైతులు

సూర్యాపేట సిటీ: సూర్యాపేట జిల్లాలో 2,95,000 మంది రైతులు పెట్టుబడి సాయానికి అర్హులుగా వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. మంగళవారం ఉదయం నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడిసాయం జమ అవుతుండగా, సర్వర్‌లో అప్‌డేట్‌ కాకపోవడంతో ఎంతమంది రైతులకు పెట్టుబడి సాయం అందిందో అధికారుల వద్ద సమాచారం లేదు. 24 గంటల దాటాకే డేటా అప్‌డేట్‌ అవుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలో రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు సుమారు 80 శాతం మంది ఉన్నారు. 10ఎకరాలకు పైగా ఉన్న రైతులు సుమారు 30 వేల మందికి పైగా, ఒక ఎకరం లోపు ఉన్న రైతులు సుమారు 85 వేలు ఉంటారని వ్యవసాయాధికారులు తెలిపారు.

2018 నుంచి యాదాద్రి జిల్లాలో రైతుబంధు సాయం ఇలా..

సంవత్సరం సీజన్‌ రైతులు సాయం

2018 వానాకాలం 1,78090 రూ.204.83కోట్లు

యాసంగి 1,63289 రూ.198.87కోట్లు

2019 వానాకాలం 1,72462 రూ.216.93కోట్లు

యాసంగి 1,39191 రూ.153.85కోట్లు

2020 వానాకాలం 2,03516 రూ.285.45కోట్లు

యాసంగి 2,09662 రూ.289.17కోట్లు

2021 వానాకాలం 2,14671 రూ.287.88కోట్లు

యాసంగి 2,2112 రూ.291.97కోట్లు

2022 వానాకాలం 2,33461 రూ.293.10కోట్లు

యాసంగి 2,61,052 రూ.303.80కోట్లు

2023 వానాకాలం 2,54,977 రూ.303.87కోట్లు

యాసంగి 2,71,590 రూ.304.78కోట్లు

Updated Date - 2023-12-13T00:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising