రాష్ట్రపతి పర్యటనకు సిద్ధమవుతున్న పోచంపల్లి
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:52 AM
భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఈ నెల 20న భూదాన్‌పోచంపల్లికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. కలెక్ట ర్ హనుమంతు కె.జెండగే, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదివారం సాయంత్రం భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు.
ఈ నెల 20న భూదాన్‌పోచంపల్లి సందర్శించనున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హనుమంతు కె.జెడంగే
భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 17: భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఈ నెల 20న భూదాన్‌పోచంపల్లికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. కలెక్ట ర్ హనుమంతు కె.జెండగే, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదివారం సాయంత్రం భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. బాలాజీ ఫంక్షన్‌హాల్ ఆవరణలో రాష్ట్రపతి సభావేదిక ఏర్పాట్లను వారు పరిశీలించారు. పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత్ పట్టు చీరల తయా రీ ప్రక్రియలను పరిశీలించారు. రాష్ట్రపతి శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 18న హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న ఆమె భూదాన్‌పోచంపల్లిలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారని, పద్మశ్రీ, సంత్ కబీర్, జాతీయ అవార్డు గ్రహీతలు చేనేత కళాకారులతో ఆమె మాట్లాడతారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవా ర్డు గ్రహీతల్లో 16 మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించామని తెలిపారు. ఇందులో ఎంపికైన వారిలో 5 నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడుతారని తెలిపారు. పోచంపల్లి చేనేత సహకార సంఘం, రూరల్ టూరిజం సెంటర్‌లోని మ్యూ జి యంను సందర్శిస్తారని, చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై అధ్యయనం చేస్తారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ‘పోచంపల్లి ఇక్కత్’ పట్టుచీరలపై అవగాహన కల్పించేందుకు చేనేత వస్త్ర కళాకారులతో సమీక్ష జరుపుతారని తెలిపారు. అయితే రాష్ట్రపతి పర్యటనకు భూదాన్‌పోచంపల్లి పోలీ్‌సస్టేషన్ సమీపంలోని మైదానం లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడి ఏర్పాట్లను వీవర్స్ సర్వీస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్‌కుమార్, చేనేత, జౌళి శాఖ జిల్లా ఏడీ విద్యాసాగర్, మునిసిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, భూదాన్‌పోచంపల్లి తహసీల్దారు బి.వీరాబాయి, ఎంఆర్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ విక్రంరెడ్డి పరిశీలిస్తున్నారు.
Updated Date - Dec 18 , 2023 | 12:52 AM