ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మునిసిపల్‌ చైర్మన, వైస్‌చైర్మనపై అవిశ్వాస నోటీసు

ABN, Publish Date - Dec 30 , 2023 | 11:40 PM

యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి మునిసిపల్‌ చైర్మన, వైస్‌చైర్మనలపై అవిశ్వాస నోటీసులను కౌన్సిలర్లు శనివారం అదనపు కలెక్టర్‌ వీరారెడ్డికి అందజేశారు.

అదనపు కలెక్టర్‌ వీరారెడ్డికి అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేస్తున్న కౌన్సిలర్లు

31 మంది కౌన్సిలర్ల సంతకాలు

భువనగిరి టౌన / భువనగిరి అర్బన, డిసెంబరు 30 : యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి మునిసిపల్‌ చైర్మన, వైస్‌చైర్మనలపై అవిశ్వాస నోటీసులను కౌన్సిలర్లు శనివారం అదనపు కలెక్టర్‌ వీరారెడ్డికి అందజేశారు. మొత్తం 35 కౌన్సిలర్లు ఉన్న కౌన్సిల్‌లో అవిశ్వాస తీర్మాన నోటీసుపై 31 మంది సంతకాలు చేశారు. ప్రస్తుతం కౌన్సిల్‌లో బీఆర్‌ఎ్‌సకు 20 మంది ఉండగా చైర్మన, వైస్‌ చైర్మన, కౌన్సిలర్లు ఏవీ కిరణ్‌కుమార్‌, చెన్న స్వాతి మినహా 16 మంది, 9 మంది కాంగ్రెస్‌, ఆరుగురు బీజేపీ సభ్యులు సంతకాలు చేశారు. అయితే మూడు నెలల కిందట మొదటిసారిగా ఇచ్చిన నోటీసులపై 19 మంది సభ్యులు మాత్రమే సంతకాలు చేయగా రెండోసారి శనివారం ఇచ్చిన నోటీసులో 31 మంది సభ్యులు సంతకాలు చేయడం గమనార్హం. అయితే కౌన్సిలర్ల అభ్యర్థనను పరిశీలించిన అదనపు కలెక్టర్‌ ప్రాథమికంగా మునిసిపల్‌ రికార్డుల ఆధారంగా సభ్యుల సంతకాలను సరిపోలుస్తామన్నారు.మెజార్టీ సభ్యులు నోటీసు అందజేసిన నేపథ్యంలో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ను కౌన్సిలర్లు కోరారు. నిబంధనల ప్రకారం ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.

ఏకపక్ష వైఖరితో విసుగుచెందాం..

పురపాలనలో చైర్మన, వైస్‌చైర్మన ఏకపక్ష వైఖరితో విసిగి వారిపై అన్నిపార్టీల కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాస తీర్మాణ నోటీసులను అందజేసినట్టు కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, టీపీసీసీ సభ్యుడు తంగళ్లపల్లి రవికుమార్‌, కౌన్సిలర్‌ పోతంశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. అదనపు కలెక్టర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా పదవులలో కొనసాగుతున్నా సొంతపార్టీ కౌన్సిలర్లతో పాటు విపక్ష సభ్యులకు కనీస గుర్తింపు, గౌరవం ఇవ్వలేదన్నారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఎండి అజీమొద్దీన మాట్లాడుతూ చైర్మన, వైస్‌చైర్మన పదవులను భువనగిరి పట్టణాన్ని కాదని విలీన గ్రామమైన రాయగిరికే బీఆర్‌ఎస్‌ నాయకులు కట్టబెట్టడంతో భువనగిరి పట్టణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికైనా స్వచ్ఛందంగా వారు రాజీనామా చేసి గౌరవం నిలుపుకోవాలన్నారు. బీజేపి కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

Updated Date - Dec 30 , 2023 | 11:40 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising