ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సంక్షేమ పథకాలతో ఆర్థిక పరిపుష్టి సాధించాలి

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:08 AM

కేంద్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకొని ఆర్థిక పరిపుష్టి సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర లో భాగంగా భువనగిరి మండ లం ముత్తిరెడ్డిగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ ద్వారా ప్రసంగించారు.

వర్చువల్‌ ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ

భువనగిరి రూరల్‌, డిసెంబరు 16: కేంద్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకొని ఆర్థిక పరిపుష్టి సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర లో భాగంగా భువనగిరి మండ లం ముత్తిరెడ్డిగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, పెట్రోల్‌, డీజిల్‌, పీఏసీఎస్‌, ఇతర కార్పొరేట్‌ బ్యాంకు రుణాలు, విద్యా, వైద్యం, తదితర పథకాల అమలు, వినియోగంపై ప్రధాని మోదీ ప్రసంగించి అవగాహన కల్పించారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీరామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల పై లబ్ధిదారులకు వివరించారు. పథకాలు అమలు చేస్తున్న బ్రోచర్లను పంపిణీచేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు మాట్లాడుతూ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర శనివారం నుంచి జనవరి 26 వరకు జిల్లాలో 42 రోజులపాటు రోజుకు రెండు మూడు గ్రామాల్లో కొనసాగుతుందన్నారు. సబ్బండవర్గాల అభివృద్ధికోసం కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 400 సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా రైతులు వ్యయ ప్రయాసలకు లోను కాకుండా తమ వ్యవసాయ పొలాల్లో యూరియాను చల్లేందుకు డ్రోన్‌ యంత్రాలను వినియోగించుకున్నట్లయితే గంటకు ఐదు ఎకరాల్లో యూరియాను చల్లవచ్చన్నారు. అనంతరం గ్రామస్థులకు వాటర్‌ క్యాన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పవన్‌ కీర్తి, బీజేపీ నాయకులు పాశం భాస్కర్‌, కాసం వెంకటేశ్వర్లు, వేముల అశోక్‌, నర్ల నర్సింగ్‌రావు, పడాల శ్రీనివాస్‌, చందా మహేందర్‌గుప్త, ఉమాశంకర్‌, శేఖర్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:08 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising