ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజల కోసమే ‘ప్రజాపాలన’

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:29 AM

కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వమ ని, ప్రజల కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింద ని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం ఆలేరులోని రైల్వే గేట్‌ వద్ద రైల్వే అండర్‌ పాస్‌ పనులను ప్రారంభించి మాట్లాడారు.

ఆలేరు రూరల్‌, డిసెంబరు 27: కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వమ ని, ప్రజల కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింద ని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం ఆలేరులోని రైల్వే గేట్‌ వద్ద రైల్వే అండర్‌ పాస్‌ పనులను ప్రారంభించి మాట్లాడారు.

ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా చేయడంతోపాటు రైల్వే అండర్‌ పాస్‌ పనులను తాను గెలిచిన అనంతరం ప్రారంభిస్తానని చెప్పి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రారంభిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. 90 రోజుల్లోపే ఈ పనులను పూర్తి చేస్తామన్నారు.

ఇంటింటికీ సోనియమ్మ పథకాలు

నేటినుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనుందని,ఇంటింటికీ సోనియమ్మ పథకాలను ప్రజలు సద్వినియోగం చే సుకోవాలని అయిలయ్య కోరారు. ఈనెల 28 నుంచి జనవరి 6వరకు ఈపథకం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్‌, కౌన్సిలర్లు చింతలఫని సునీత, గుత్త సమంతారెడ్డి, సంగు భూపతి,కాంగ్రెస్‌ మండల, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్‌రాజు, ఎజా జ్‌, సాగర్‌రెడ్డి, శ్రీకాంత్‌, రమేష్‌, నిర్మల, భాస్కర్‌, మధు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట మునిసిపాలిటీ అభివృద్ధే ధ్యేయం

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట మునిసిపాలిటీ అభివృద్ధే తన ధ్యేయమని బీర్ల అయిలయ్య అన్నారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయంలో జరిగిన పాలకవర్గం సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌన్సిలర్లు తమ తమ వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సేకరించి తమ దృష్టికి తేవాలని సూచించారు. అంతకుముందు మునిసిపల్‌ కార్యాలయంలో నియోజకవర్గ తహసీల్దార్లు, ఎంపీడీవోలు, స్పెషల్‌ ఆఫీసర్లతో ఆరు గ్యారంటీలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీపీఐ నాయకులు, కార్యకర్తలు విప్‌ను మర్యాదపూర్వకంగా సన్మానించారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ కాటంరాజు, కమిషనర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:29 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising