ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మునిసిపాలిటీపై పట్టుకు కాంగ్రెస్‌ వ్యూహం

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:46 AM

కాంగ్రెస్‌ నుంచి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రేసు లో కోతి సంపత్‌రెడ్డి, వెలిదండ సరిత, కస్తాల శ్రావణ్‌ ఉన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే వైస్‌చైర్మన్‌ పదవి లభించే అవకాశాలు ఉన్నాయి.

తెరపైకి మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ అవిశ్వాసం

కాంగ్రె్‌సలో చేరిన ఇద్దరు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

వైస్‌చైర్మన్‌గిరి ఎవరికో?

కాంగ్రెస్‌ నుంచి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రేసు లో కోతి సంపత్‌రెడ్డి, వెలిదండ సరిత, కస్తాల శ్రావణ్‌ ఉన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే వైస్‌చైర్మన్‌ పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ అనుభ వం, సామాజికవర్గాల సమీకరణలు, అధిష్ఠానాని కి విధేయులైన వారినే వైస్‌చైర్మన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని, పార్టీలోని కీలక నాయకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ శ్రావణ్‌కుమార్‌, యువనేతగా ఎదుగుతు న్న సంపత్‌రెడ్డి, మహిళా కోటాలో సరితారెడ్డి వైస్‌చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నట్టు తెలిసింది. ఏది ఏమైనా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల చేరికలతో కాంగ్రెస్‌ జోష్‌ మీదున్నది.

హుజూర్‌నగర్‌, డిసెంబరు 17: మునిసిపాలిటీలో కాంగ్రెస్‌ ఆధిపత్యానికి చాటేందుకు యత్నిస్తోంది. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల ముందు కాంగ్రె్‌సలో చేరగా, వైస్‌చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే శనివారం బీఆర్‌ఎ్‌సకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఓరుగంటి నాగేశ్వరరావు, జక్కుల శంభయ్య కాంగ్రె్‌సలో చేరారు. మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉన్న మునిసిపాలిటీలో ఇప్పటికే 14మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్‌ బలంగా మారింది. మరికొందరు కౌన్సిలర్లు సైతం కాంగ్రె్‌సలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

పడిపోతున్న బీఆర్‌ఎస్‌ బలం

అసెంబ్లీ ఎన్నికల ముందు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చన, కౌన్సిలర్లు అమరబోయిన సతీష్‌, వీర్లపాటి గాయత్రి, దొంతగాని పద్మగౌడ్‌, గుంజ భవాని బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరారు. శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఓరుగంటి నాగేశ్వరరావు, జక్కుల శంభయ్య కాంగ్రె్‌సలో చేరగా, రాజకీయం రసవత్తరంగా మారింది. 2020 లో 28 స్థానాలకు జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 20 స్థానాలు, కాంగ్రె్‌సకు ఏడు స్థానాలు, సీపీఎంకు ఒక స్థానం దక్కింది. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బలాబలాలు తారుమారవుతున్నాయి. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ నుంచి ఏడుగురు కౌన్సిలర్లు కాంగ్రె్‌సలో చేరగా, బీఆర్‌ఎస్‌ బలం 13కు తగ్గింది. వీరిలో మరో ఆరుగురు కౌన్సిలర్లు కాంగ్రె్‌సలో చేరనున్నట్టు తెలిసింది. ఇటీవల ఆరుగురు కౌన్సిలర్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మంతనాలు చేసినట్లు సమాచారం. వారు కాంగ్రె్‌సలో చేరితే బీఆర్‌ఎ్‌సలో బలం ఏడుకు పడిపోనుంది. నిన్నమొన్నటి వరకు అంగ, ఆర్థిక బలం కలిగిన కొంతమంది కౌన్సిలర్లు స్థానికంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయినా, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తమ హవా కొనసాగుతుందని ఆశించారు. కాగా, ఉత్తమ్‌ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందడమేగాక, మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో కాంగ్రె్‌సలో చేరేందుకు కౌన్సిలర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కౌన్సిలర్లు ప్రారంభ దశలోనే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరారు.

పట్టు సాధించేందుకు కాంగ్రెస్‌

మునిసిపాలిటీలో పూర్తి ఆధిపత్యాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు రాజకీయంగా వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఏడు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ను పార్టీలో చేర్చుకోవడంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుఉంది. ఇప్పుడు వైస్‌చైర్మన్‌ పీఠం సైతం దక్కించుకునేలా పావులు కదుపుతోం ది. బీఆర్‌ఎ్‌సలో ఉన్నప్పుడే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చన, సొంత పార్టీకి చెందిన వైస్‌ చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావుపై కాంగ్రెస్‌ కౌన్సిలర్ల సహకారంతో అవిశ్వాస తీర్మానం పెట్టారు.

దీన్ని బీఆర్‌ఎస్‌ మాజీ ప్రజాప్రతినిధి అడ్డుకోవడంతో ఉన్నతాధికారులు నాడు తాత్కాలికంగా అవిశ్వాసాన్ని నిలిపివేశారు. గత వారం నుంచి మళ్లీ కాంగ్రెస్‌ వైస్‌చైర్మన్‌ పై అవిశ్వాస అంశాన్ని తెరపైకి తెచ్చింది. గతంలో ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నప్పుడే అవిశ్వాసం పెట్టిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఇప్పు డు బలం 14కు చేరడంతో అవిశ్వాసంపై గట్టిగా యత్నిస్తోంది. 15 మంది కౌన్సిలర్లు ఉంటే వైస్‌చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది. బీఆర్‌ఎ్‌సకు చెందిన కౌన్సిలర్లు కొంతమంది వారం రోజుల్లో కాంగ్రెస్‌ గూటికి చేరే అవకాశం ఉండడంతో అవిశ్వాసం వ్యవహారం రసవత్తరంగా మారనుంది.

Updated Date - Dec 18 , 2023 | 12:48 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising