ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీఎం సీపీఆర్వోగా అయోధ్యరెడ్డి

ABN, First Publish Date - 2023-12-13T00:09:52+05:30

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్వో)గా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రానికి చెం దిన బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బోరెడ్డి అయోధ్యరెడ్డి

తుర్కపల్లి, డిసెంబరు 12: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్వో)గా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రానికి చెం దిన బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మండలకేంద్రానికి చెందిన బోరెడ్డి భారతమ్మసత్తిరెడ్డి దంపతుల పెద్ద కుమారుడు అయోధ్యరెడ్డి. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవతరతి వరకు చదివిన ఆయన ఇంటర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ జగదేవ్‌పూర్‌, ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ డిగ్రీ కళాశాల భువనగిరిలో డిగ్రీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాల యంలో ఎంసీజే(కమ్యూనికేషన్‌ జర్నలిజం), హైద్రాబాద్‌ కేవి రంగారెడ్డి కళాశాలలో ఎల్‌ఎల్‌బి చదివారు. ఆయన పలు ప త్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. 2018లో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, స్టేట్‌ మీడియా కోఆర్డినేటర్‌గా పని చేశారు. భారత్‌ జూడో యాత్రలో మీడియా కమిటీ కన్వీనర్‌గా, 2023 ఎన్నికల్లో వార్‌ రూం కోఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు.

Updated Date - 2023-12-13T00:09:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising