ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రభుత్వ పాఠశాలలపై కమిటీల పర్యవేక్షణ ఏదీ?

ABN, Publish Date - Dec 22 , 2023 | 12:02 AM

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సలహాలు స్వీకరించి వాటిని ఆచరణలో పెట్టేందుకు ఏర్పాటుచేసిన పాఠశాల యాజమాన్య కమిటీలు (ఎస్‌ఎంసీ) కేవలం మొక్కుబడిగా మారాయి.

2019లో ఎస్‌ఎంసీల ఎన్నికలు

ఈ నెలాఖరు వరకే వాటి గడువు

కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ గడువు పెంచేనా? కొత్త కమిటీలను నియమించేనా?

చౌటుప్పల్‌: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సలహాలు స్వీకరించి వాటిని ఆచరణలో పెట్టేందుకు ఏర్పాటుచేసిన పాఠశాల యాజమాన్య కమిటీలు (ఎస్‌ఎంసీ) కేవలం మొక్కుబడిగా మారాయి. విద్యార్థుల తల్లిదండ్రులను ఈ కమిటీలో భాగస్వామ్యం చేస్తున్నా, చాలాచోట్ల వారు పాఠశాలల వైపు చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. విద్యాభివృద్ధితో పా టు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడంతో పాటు కేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉండగా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.ఎస్‌ఎంసీల గడు వు ఈ నెల చివరి వరకు ఉండగా, ఆ తరువాత కొత్త కమిటీలను ఎన్నుకోవాల్సి ఉంది.

నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలలు మొత్తం 1,483 ఉన్నాయి. అందులో ప్రాథమిక పాఠశాలలు 1,211, ప్రాథమికోన్నత పాఠశాలలు 291, ఉన్నత పాఠశాలలు 497 వరకు ఉన్నాయి. ఎయిడెడ్‌ పాఠశాలలు 453 కాగా, రెసిడెన్షియల్‌, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు మరో 107, జవహర్‌ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు మూడు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి 2,21,864 మంది విద్యార్థులు విద్య ను అభ్యసిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 481, ప్రాథమికోన్నత పాఠశాలలు 68, ఉన్నత పాఠశాలలు 163 వరకు ఉన్నాయి. కేజీబీవీలు 11, మోడల్‌స్కూ ళ్లు 7, ఒక కేంద్రీయ విద్యాలయం, ఎయిడెడ్‌ పాఠశాలలు 10 ఉన్నాయి. వీటిలో 1,04,015 మంది విద్యార్థులు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 715 ప్రాథమిక పాఠశాలలు, 181 ప్రా థమికోన్నత పాఠశాలలు, 349 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 1,35,889 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.

కొరవడిన అవగాహన

ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీలను ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసింది. ప్రతీ తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. సర్పంచులు, ఎంపీపీ, మునిసిపల్‌ చైర్మన్లు పాఠశాలలను సందర్శించాల్సి ఉండగా, చాలా పాఠశాలల్లో ఇది అమలు కావడం లేదు. పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం కమిటీలోని సభ్యులకు, విధివిధానాలపై అవగాహన కల్పించాల్సిన ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఎస్‌ఎంసీలు నామమాత్రంగానే మిగిలిపోతున్నాయి. పాఠశాలల సమస్యలు, విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలపై కమిటీ ఎప్పటికప్పుడు దృష్టి సా రించాలి. మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించేలా పర్యవేక్షించాలి. అయితే అవగాహ న లేక యాజమాన్య కమిటీలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పలు సమస్యలు ఉన్నాయి. చాలా చోట్ల కనీస మౌలిక వసతులు కూడా లేవు. పాఠశాల యాజమాన్య కమిటీల పర్యవేక్షణ ఉంటేనే వసతుల కల్పనతోపాటు బోధన మెరుగుపడి ఉపాధ్యాయుల్లో సైతం జవాబుదారీతనం పెరుగుతుంది. ఇదిలా ఉండగా 2019లో నూతన ఎస్‌ఎంసీలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం ఆ తరువాత వాటి జోలికి వెళ్లలేదు. ఏటా కొత్త కమిటీలను ఎన్నుకోవాల్సి ఉండగా, ప్రభు త్వం మాత్రం పాత కమిటీల గడువును పెంచుతూ వచ్చింది. ఈ గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. వచ్చే ఏడాది జనవరిలో నూతన కమిటీలను ఎన్నుకోవాల్సి ఉం ది. అయితే నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నూతన కమిటీలను ఏర్పాటు చేస్తుందా లేక పాత కమిటీల గడువునే పెంచుతుందా అనేది వేచి చూడాల్సిందే.

ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు : నారాయణరెడ్డి, డీఈవో

ఎస్‌ఎంసీల కమిటీల గడువు పెంపునకు సంబంధించి ప్రభుత్వ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ నెలాఖరు వరకు కమిటీలకు గడువు ఉంది. గడువు పూర్తి కాగానే కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తారా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కొత్త కమిటీలను ఏర్పాటు చేయకపోతే ఉన్న వాటిని పొడిగించే అవకాశం ఉంది.

Updated Date - Dec 22 , 2023 | 12:02 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising