ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘గడా’ రద్దు!

ABN, Publish Date - Dec 31 , 2023 | 04:28 AM

గజ్వేల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అఽథారిటీ (గడా) రద్దు కానుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. 2014లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు.

గజ్వేల్‌ అభివృద్ధిలో పదేళ్లుగా కీలకపాత్ర

కేసీఆర్‌కు ఓఎస్డీగా ముత్యంరెడ్డి

గజ్వేల్‌, డిసెంబరు 30: గజ్వేల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (గడా) రద్దు కానుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. 2014లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గజ్వేల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ(గడా)ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రత్యేక నిధితో అభివృద్ధి పనుల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇలాంటి అథారిటీలు ఏర్పాటు చేస్తుంటారు. ఓ ప్రత్యేకాధికారి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ సంస్థ ద్వారా నియోజకవర్గం బాధ్యతలు చూసుకుంటుంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పులివెందుల ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ, అంతకుముందు కుప్పం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీలను ఇలాగే ఏర్పాటు చేశారు.

కేసీఆర్‌ సీఎం అవ్వడంతో 2014లో ఏర్పాటైన గడ 2024 వరకు దాదాపు పదేళ్ల పాటు గజ్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధికి పని చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో కడా (కొడంగల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ) ఏర్పాటైంది. దీంతో గడా రద్దు కానుంది. కాగా, ఐదేళ్లుగా ‘గడా’ ప్రత్యేకాధికారిగా(ఓఎస్డీ)గా పని చేస్తున్న ముత్యంరెడ్డి ఇకపై బీఆర్‌ఎ్‌సఎల్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓఎస్డీగా వ్యవహరించనున్నట్టు సమాచారం. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి అయిన ముత్యంరెడ్డి.. కేసీఆర్‌, హరీశ్‌రావుకు అత్యంత నమ్మకస్తుడనే పేరుంది. కేసీఆర్‌ కూడా ముత్యంరెడ్డిని ఓఎస్డీగా నియమించుకోవాలని అనుకుంటున్నారని తెలిసింది.

Updated Date - Dec 31 , 2023 | 06:59 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising