నేడు అర్ధరాత్రి 1 వరకు మెట్రో సర్వీసులు
ABN, Publish Date - Dec 31 , 2023 | 03:37 AM
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను అర్ధరాత్రి 1 గంట వరకు నడిపించనున్నట్లు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా రైళ్ల వేళల్లో మార్పు
రెండు ఎంఎంటీఎస్ స్పెషల్ సర్వీసులు కూడా..
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను అర్ధరాత్రి 1 గంట వరకు నడిపించనున్నట్లు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. చివరి రైలు రాత్రి 12.15 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు గమ్యస్థానానికి చేరుకుంటుందని చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో స్టేషన్లు, రైళ్లలోకి ఎవరైనా మద్యం తాగి వచ్చినా, తోటి ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత రెండు ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. రాత్రి 1.15 గంటలకు లింగంపల్లి నుంచి హైదరాబాద్ (నాంపల్లి)కి ఒక ఎంఎంటీఎస్ సర్వీసు, 1.30 గంటలకు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు మరొక సర్వీసు నడుస్తాయని చెప్పారు.
Updated Date - Dec 31 , 2023 | 03:37 AM