ముగిసిన మెథడిస్తు జాతర
ABN, First Publish Date - 2023-12-10T22:50:05+05:30
ధారూరులో ఆరు రోజులపాటు జరిగిన మెథడిస్ట్ క్రిస్టియన్ జాతర ఆదివారంతో ముగిసింది. ఆదివారం సెలవు దినం కావడంతో యాత్రికులు దాదాపు 1.5 లక్షల వరకు వచ్చారు.
చివరి రోజు లక్షల మంది వచ్చిన భక్తులు
రవాణా సౌకర్యం సరిగ్గా లేక జాతరలోనే వేలాది మంది యాత్రికులు
ధారూరు,. డిసెంబరు10: ధారూరులో ఆరు రోజులపాటు జరిగిన మెథడిస్ట్ క్రిస్టియన్ జాతర ఆదివారంతో ముగిసింది. ఆదివారం సెలవు దినం కావడంతో యాత్రికులు దాదాపు 1.5 లక్షల వరకు వచ్చారు. ముగింపు ఉత్సవాలకు హాజరైన బిష్‌పలు కర్‌కరే, డ్యానెయల్‌లకు జాతర కార్యదర్శి దయానంద్, కోశాధికారి స్టీవెన్‌లు స్వాగతం పలికారు. వారు చేసిన భోధనలు, ప్రార్థనలతో జాతర ప్రాంగణమంతా మార్మోగింది. ఎక్కడ విన్నా ఏసు నామమే వినిపించింది. ప్రధాన ముఖద్వారా వద్ద నెలకొన్న ఏసుక్రీస్తు శిలువ వద్ద లక్షలాది యాత్రికులు ప్రార్ధనలు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు జాతరకు వచ్చినట్లు ఉత్సవాల కార్యదర్శి దయానంద్, కోశాధికారి స్టెవెన్ తెలిపారు. ఓ వైపు ముందు వచ్చిన యాత్రికులు వెళ్లిపోతుంటే, మరోవైపు చివరిరోజు జాతరకు యాత్రకులు రావడం కన్పించింది. రైళ్లకోసం కర్ణాటక, మహారాష్ట్రాల యాత్రికులు గంటల తరబడి నిరీక్షించారు. ఈ మార్గంలో బెంగుళూరు, నాందెడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే ఆగి వెళ్లాయి. ఇతర ఆగగపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాగా భక్తులు తిరుగు ప్రయాణంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సీఐ రామకృష్ణ, పోలీసు సిబ్బంది పార్కింగ్ స్థలాలను పెంచి వాహనాలను జాతర ప్రాంగణంలోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. జాతర నుంచి దోర్నాల్ మీదుగా తాండూరు, పరిగి, కొడంగల్, వికారాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు. దాదాపు 10 వేల మంది వరకు సాయంత్రం రవాణా సౌకర్యం లేక కాక జాతరలోనే ఉండిపోయారు. జాతరకు వచ్చే ప్రతి యాత్రికులు హుండీలో డబ్బులు వేయడం సర్వసాధారణమెనా తమ కోర్కేలు తీరిన, మొక్కుకున్న యాత్రికులు మేకలు, గొర్రెలు, కోళ్లు వెండి, బంగారు నగలు దానం చేశారు. సాయంత్రం మేకలు, గొర్రెలు, కోళ్లను నిర్వాహకులు వేలం వేశారు. విక్రయించారు. ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఉత్సవాల్లో డాగ్ స్వ్వాడ్ సిబ్బంది, బాంబ్ స్వ్కాడ్ తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చేపట్టారు.
Updated Date - 2023-12-10T22:50:06+05:30 IST