ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటరు భిన్నతీర్పు

ABN, First Publish Date - 2023-12-04T23:44:55+05:30

తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు భిన్న పరిణామాలు ఎదురయ్యాయి. 2018 ఎన్నికలతో పాటు 2020 దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు పోలైన ఓట్లకు.. ప్రస్తుత ఓట్లకు పొంతన లేకుండా పోయింది.

కాంగ్రె్‌సకు ఒక సీటు.. బీజేపీకి పెరిగిన ఓట్లు

సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయిన కమలం

హస్తానికీ పెరిగిన ఓటు బ్యాంకు

గత ఎన్నికలతో పోల్చితే భిన్న పరిణామాలు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 4: తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు భిన్న పరిణామాలు ఎదురయ్యాయి. 2018 ఎన్నికలతో పాటు 2020 దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు పోలైన ఓట్లకు.. ప్రస్తుత ఓట్లకు పొంతన లేకుండా పోయింది. కాంగ్రెస్‌ పార్టీకి ఒక అసెంబ్లీ సీటు దక్కగా.. బీజేపీ మాత్రం తన సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింది. ప్రజాదరణలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఓట్ల శాతం పెరిగిందనే చెప్పాలి.

హుస్నాబాద్‌లో కాంగ్రె్‌సకు లక్ష ఓట్లు

హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు 1,00955 ఓట్లు పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ పొత్తుతో బరిలోకి దిగిన చాడ వెంకటరెడ్డికి 46,553 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కూడా కాంగ్రె్‌సను సీపీఐ బలపర్చడంతో ఆ సంఖ్య రెట్టింపైంది. ఇక్కడ 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన చాడ శ్రీనివా్‌సరెడ్డికి 4309 ఓట్లు పోలవ్వగా ప్రస్తుతం బొమ్మ శ్రీరాంచక్రవర్తికి 8228 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు పోలైన ఓట్ల కంటే తక్కువగా రావడం గమనార్హం.

గజ్వేల్‌లో పెరిగిన కాషాయ బలం

ఒకప్పుడు గజ్వేల్‌లో కానరాని బీజేపీ బలం ఈ ఎన్నికల్లో ఒక్కసారిగా పుంజుకుంది. గతంలో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉండేది. అయితే ఈటల రాజేందర్‌ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. 2018 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆకుల విజయకు 1527 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ప్రస్తుతం 66,653 ఓట్లకు చేరింది. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన వంటేరు ప్రతాపరెడ్డికి 66,839 ఓట్లు పోలవ్వగా.. ప్రస్తుతం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన తూంకుంట నర్సారెడ్డికి 32,568 మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్‌ బలం తగ్గడంతో పాటు బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. బీఆర్‌ఎ్‌సకు సంబంధించిన దాదాపు 20వేల పైచిలుకు ఓట్లు కమలం ఖాతాలో పడ్డాయి.

సిద్దిపేటలోనూ చీలిన ఓట్లు

సిద్దిపేట నియోజకవర్గంలోనూ దాదాపు 20వేలకు పైగా ఓట్లు కాంగ్రెస్‌, బీజేపీ ఖాతాలో అదనంగా చేరాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రె్‌స-టీజేఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన మరికంటి భవానీరెడ్డికి 12,596 ఓట్లు రాగా.. ప్రస్తుతం కాంగ్రెస్‌ అభ్యర్థి పూజల హరికృష్ణకు 23,208 ఓట్లు వచ్చాయి. దాదాపు ఓట్ల శాతం రెట్టింపైంది. ఇక 2018లో బీజేపీ అభ్యర్థి నాయిని నరోత్తంరెడ్డికి 11,266 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డికి 23,201 ఓట్లు వచ్చాయి. బీజేపీకి కూడా రెట్టింపు ఓట్ల శాతం పెరిగింది. సిద్దిపేటలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసిన చక్రధర్‌గౌడ్‌ సైతం 16 వేల ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీలకు అదనంగా పోలైన ఓట్ల కారణంగా హరీశ్‌రావు మెజారిటీ దాదాపు 30 వేలు తగ్గింది.

దుబ్బాకలో బీజేపీకి మైనస్‌

దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీకి కోలుకోలేని నష్టం ఎదురైంది. 2018 ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా దక్కని బీజేపీకి 2020 ఉపఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాన్ని అప్పగించారు. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు హోరాహోరీ పోరులో నాడు 63,352 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. ప్రస్తుతం ఆయనే మరోసారి బీజేపీ అభ్యర్థిగా నిలువగా 43,744 ఓట్లకే పరిమితమయ్యారు. దాదాపు 20వేల ఓట్లు తగ్గాయి. ఇక 2020లో కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివా్‌సరెడ్డికి 21,819 ఓట్లు పోలవ్వగా ఈసారి 24,947 ఓట్లు వచ్చాయి. 3వేల పైచిలుకు ఓట్లు అదనంగా సాధించారు. 2020లో బీఆర్‌ఎ్‌సకు 62,273 ఓట్లు పోలవ్వగా ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి 97,451 ఓట్లు రావడంతో విజేతగా నిలిచారు.

Updated Date - 2023-12-06T06:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising