ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నోటాకు ఓటు

ABN, First Publish Date - 2023-12-04T23:46:27+05:30

తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈవీఎంలలో ఈసారి పెద్దసంఖ్యలో స్వతంత్ర అభ్యర్థుల పేర్లు దర్శనమిచ్చాయి

4 నియోజకవర్గాల్లో 95 మంది అభ్యర్థులు

70 మందికి నోటా కంటే తక్కువ ఓట్లు

బీఆర్‌ఎస్‌ ఓట్లకు గండికొట్టిన రోటీమేకర్‌

హరీశ్‌ రికార్డు మెజారిటీకి ఆటంకం

12 వేల పైచిలుకు ఓట్లను చీల్చిన వైనం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 4 : తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈవీఎంలలో ఈసారి పెద్దసంఖ్యలో స్వతంత్ర అభ్యర్థుల పేర్లు దర్శనమిచ్చాయి. వీరితోపాటు ఏ అభ్యర్థికీ ఓటు వేయకుండా ఉండాలంటే నోటా గుర్తుకు ఓటు వేసే అవకాశం కూడా కల్పించారు. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థులకు మించి నోటాకు ఓట్లు కురిశాయి. జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్‌, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 95 మంది బరిలో ఉన్నారు. అత్యధికంగా గజ్వేల్‌ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాగా 95 మందిలో సుమారు 75 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలబడడం గమనార్హం. ఇంకా ఆసక్తికర విషయమేమంటే 70 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువగా ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇటు స్వతంత్ర అభ్యర్థుల కంటే తమ ప్రాధాన్యత నోటా వైపేనని బటన్‌ నొక్కి చెప్పారు.

- సిద్దిపేట నియోజకవర్గంలో 21 మంది పోటీ చేయగా నోటా గుర్తుకు 1300 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 16 మందిని నోటా అధిగమించింది.

- దుబ్బాక నియోజకవర్గంలో 11 మంది పోటీలో ఉండగా నోటా 4వ స్థానంలో నిలిచింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. నోటాకు 2,261 ఓట్లు పడ్డాయి. బీఎస్పీ అభ్యర్థి ఐదవ స్థానం దక్కించుకున్నారు.

- గజ్వేల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 44 మంది పోటీ చేశారు. ఇక్కడ నోటా గుర్తుకు 826 ఓట్లు పోలయ్యాయి. నోటా కంటే తక్కువ స్థానాల్లో 33 మంది ఉండడం గమనార్హం.

- హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక్కడ 1222 ఓట్లు నోటా గుర్తుపై పోలయ్యాయి. ఇక్కడ 13 మందికి నోటా కంటే తక్కువగా ఓట్లు పోలుకావడం విశేషం.

కారు గుర్తులాగే రోటీమేకర్‌

అచ్చం కారు గుర్తుతో పోలినట్లుగా ఉండే రోటీమేకర్‌(చపాతి రోలర్‌) గుర్తుతో తమ ఓట్లకు గండిపడిందని బీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆందోళన నెలకొన్నది. సిద్దిపేట నియోజకవర్గంలో రోటీమేకర్‌ గుర్తుతో పోటీచేసిన పిల్లిసాయికుమార్‌ అనే అభ్యర్థికి 4,970 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరీశ్‌రావుకు పోలైతే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా మరోసారి రికార్డుల్లోకెక్కేవారని భావిస్తున్నారు. ఈసారి అత్యధిక మెజారిటీ కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ 85వేల పైచిలుకు ఓట్లు సాధించగా హరీశ్‌రావుకు 83వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ వచ్చింది. రోటీమేకర్‌కు పోలైన ఓట్లు కలిస్తే 89వేల పైచిలుకు మెజారిటీ వచ్చేదని అనుకుంటున్నారు. ఇక హుస్నాబాద్‌లో రోటీమేకర్‌ గుర్తు కలిగిన స్వతంత్ర అభ్యర్థి గద్ద సతీశ్‌కు 5,097 ఓట్లు పోలయ్యాయి. గజ్వేల్‌ నియోజకవర్గంలోనూ రోటీమేకర్‌ గుర్తుతో బరిలో నిలిచిన రఘుమారెడ్డికి 2224 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లు కూడా బీఆర్‌ఎస్‌ ఖాతాలో పడేవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలా దాదాపు 12వేల పైచిలుకు ఓట్లు రోటీమేకర్‌ గుర్తు రూపంలో కారుకు పడే ఓట్లను గండికొట్టిందని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందే ఈ గుర్తును తొలగించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2023-12-06T06:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising