ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముక్కోటి శోభ

ABN, Publish Date - Dec 23 , 2023 | 11:17 PM

సంగారెడ్డి జిల్లాలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి.

వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు

ఉత్తర ద్వార దర్శనానికి బారులు

వైకుంఠపురంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌, కలెక్టర్‌ శరత్‌ పూజలు

సంగారెడ్డి అర్బన్‌/జోగిపేట, డిసెంబరు 23: సంగారెడ్డి జిల్లాలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. వైష్ణవాలయాలు ఉత్తర ద్వార దర్శనం కోసం తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడాయి. సంగారెడ్డిలోని శ్రీవైకుంఠపురం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయానికి భక్తులు బారులు తీరారు. శ్రీవైకుంఠపురంలో వేంకటేశ్వరస్వామిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ దంపతులు, కలెక్టర్‌ దంపతులు, జిల్లా ప్రధాన న్యాయాధికారి ప్రభాకర్‌రావు, ఐఐటీ డైరెక్టర్‌, డీఆర్‌డీవో శ్రీనివాసరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. బైపాస్‌ రోడ్డులోని బాలాజీ ఆలయంలోనూ భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకున్నారు. పట్టణ శివారులోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. అలాగే, అందోలు పట్టణంలోని శ్రీరంగనాథాలయాన్ని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ దర్శించుకున్నారు. అర్చకులు శ్యాంనాథ్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు.

మెదక్‌ జిల్లాలో కిటకిటలాడిన వైష్ణవాలయాలు

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 23: ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం మెదక్‌ జిల్లాలోని వైష్ణవాలయాలు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం వైష్ణవాలయాలకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులుతీరారు. జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయం, వేంకటేశ్వరాలయాల్లో ఆర్చకులు భాష్యం మధుసూదనార్యులు, నరేంద్రచార్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, ఆర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. పుష్పాలతో అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులను ఉంచి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్మే పద్మాదేవేందర్‌రెడ్డి స్వామివారిని దర్శించుకుని పల్లకీ సేవలో పాల్గొన్నారు. అనంతరం వేంకటేశ్వరాలయాన్ని వారు దర్శించుకున్నారు. మాధవానంద సరస్వతీ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం లక్షపుష్పర్చాన, సంగీత విభావరి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లిఖార్జున్‌గౌడ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ బండ నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 11:17 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising