ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు

ABN, First Publish Date - 2023-10-30T00:11:30+05:30

పార్టీ కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

మంత్రికి వివరిస్తున్నసమస్యలను కొండపాక మండల నాయకులు

మంత్రి హరీశ్‌రావు

కొండపాక, అక్టోబరు 29 : పార్టీ కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కొండపాక మండలంలోని పలువురు కార్యకర్తలు, నాయకులు కొద్దిరోజుల నుంచి అసమ్మతితో ఉండడంతో వారిని మంత్రి హైదరాబాద్‌కు పిలిపించుకొని మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న తమకు గుర్తింపు లేకుండాపోయిందని మండలంలోని పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు ఇటీవల దుద్దెడలో సమావేశం నిర్వహించారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో మంత్రి ఆదివారం వారితో మాట్లాడి పార్టీ కోసం కష్టపడే వారిని ఎప్పుడూ మరిచిపోదని వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను తన దృష్టికి తేవాలని మంత్రి కోరారు. కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు.

Updated Date - 2023-10-30T00:11:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising