ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్లాస్టిక్‌ రహితంగా మల్లన్నజాతర

ABN, Publish Date - Dec 30 , 2023 | 11:48 PM

కొమురవెల్లి మల్లన్న జాతర ఉత్సవాలను అధికారులు సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ప్లాస్టిక్‌రహితంగా నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శనివారం కొండపాక మం డలం నాగులబండ వద్ద గల మినర్వా హరిత హోటల్‌లో మల్లన్న జాతరపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ

పరిశుభ్ర పట్టణంగా కొమురవెల్లి

గుర్తుండిపోయేలా విజయవంతం చేయాలి

ఏడాదిపొడవుగా జాతర సాగేలా ఉండాలి

కొండపైకి వెళ్లేందుకు బ్యాటరీ రిక్షాల ఏర్పాటు

కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై సమీక్షలో మంత్రి కొండా సురేఖ

ప్రొటోకాల్‌ పాటించలేదని సమావేశాన్ని బహిష్కరించిన ‘పల్లా’ రాజేశ్వర్‌

కొండపాక, డిసెంబరు 30 : కొమురవెల్లి మల్లన్న జాతర ఉత్సవాలను అధికారులు సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ప్లాస్టిక్‌రహితంగా నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శనివారం కొండపాక మం డలం నాగులబండ వద్ద గల మినర్వా హరిత హోటల్‌లో మల్లన్న జాతరపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మల్లన్న జాతర ఎప్పటికీ చర్చించుకునేలా ఈ సంవత్సరం నిర్వహించాలని, 365 రోజులు కూడా జాతర సాగేలా ఉండాలన్నారు. ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని, ఎక్క డ కూడా ప్లాస్టిక్‌, చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొమురవెల్లిని క్లీన్‌గా ఉంచాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉంటే బస్సుల సంఖ్యను పెంచాలని చెప్పారు.

కొండపైకి వెళ్లడానికి బ్యాటరీ రిక్షాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. జాతర ప్రశాంత వాతావరణంలో భక్తిభావంతో జరిగేలా ప్రతిశాఖ సమన్వయంతో పనిచేసి పేరు తీసుకురావాలని తెలిపారు. ముందుగా అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ అందె శ్రీనివాసరావు, హుస్నాబాద్‌ ఏసీపీ సతీష్‌ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి, మద్దూరు జడ్పీటీసీ గిరికొండల్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, అధికారులు నాయకులు పాల్గొన్నారు.

మంత్రి, ఎమ్మెల్యే మధ్య ప్రొటోకాల్‌ వివాదం

సిద్దిపేట హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య ప్రొటోకాల్‌ కోసం వాగ్వాదం చోటుచేసుకున్నది. కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతరపై సమీక్షా సమావేశం జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి సమావేశంలో ఎలా ఉంటారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మాటామాటా పెరిగి వివాదం ముదిరింది. దీంతో సమావేశాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సంప్రదాయాలకు, ఆచారాలకు వ్యతిరేకంగా సిద్దిపేటలో సమావేశం పెట్టడం, కాంగ్రె్‌సలో ఓడిన వ్యక్తిని స్టేజీ మీదకు పిలవడం చాలా దురదృష్టకరమన్నారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ హోటల్‌లో సమావేశం పెట్టలేదన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను వెళ్లిపొమ్మనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో మంత్రి మాట్లాడుతూ ప్రొటోకాల్‌ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నదని, వారి పాలనలో ప్రొటోకాల్‌ విషయం ఎలా పాటించారో అందరికీ తెలుసన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 11:48 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising