దివ్యాంగుల క్రీడా పోటీలకు ఏర్పాట్లు చేయండి
ABN, Publish Date - Dec 14 , 2023 | 11:28 PM
సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
సంగారెడ్డి రూరల్, డిసెంబరు 14: దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో మహిళా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, సంబంధ శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు క్రీడా పోటీలను సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పోటీల్లో ఐదు క్రీడలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు ఉంటాయని, జూనియర్ కేటగిరిలో 10 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల వారు, సీనియర్ కేటగిరిలో 17 సంవత్సరాలు ఆ పై వయస్సు ఉన్న వారు (బదిరులు, అంధులు, శారీర, మానసిక వూకల్యం గల దివ్యాంగ మహిళలు, పురుషులు) ఈ క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. సమావేశంలో సమావేశంలో డీడబ్ల్యూవో సంధ్యారాణి, డీఆర్డీవో శ్రీనివా్‌సరావు, డీఈవో వెంకటేశ్వర్లు, యువజన క్రీడల అధికారి రాంచందర్‌రావు, డీఎంఅండ్‌హెచ్‌వో గాయత్రిదేవి, మెప్మా పీడీ గీత, మున్సిపల్ కమిషనర్ సుజాత, వివిధ శాఖల అధికారలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 14 , 2023 | 11:28 PM