ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముచ్చట.. మూణ్ణాళ్లే

ABN, First Publish Date - 2023-12-06T00:04:27+05:30

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరిగ్గా నాలుగైదు నెలల కింద అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలోని పలువురు నాయకులకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను కట్టబెట్టారు.

4నెలల ముందే కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకం

ప్రభుత్వం మారడంతో పదవులకు నేతల గుడ్‌బై

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, డిసెంబరు 5: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరిగ్గా నాలుగైదు నెలల కింద అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలోని పలువురు నాయకులకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను కట్టబెట్టారు. 2018లో అధికారం చేపట్టిన కేసీఆర్‌ ఈ ఎన్నికలకు ముందుగా జిల్లాలోని నాయకులకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను ఇవ్వడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న ఆయా పదవులను ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి ఉపయోగపడతారన్న నాయకులకు ఇచ్చారు. ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్న నాయకులకు కూడా కార్పొరేషన్‌ పదవులు కట్టబెట్టారు. ఈ రకంగా కాంగ్రె్‌సలో ఉన్న జహీరాబాద్‌కు చెందిన నరోత్తమ్‌ను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్న కేసీఆర్‌ ఎస్సీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు. జహీరాబాద్‌కు చెందిన పార్టీ మైనారిటీ నాయకుడు ఎండీ తన్వీర్‌ను పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించారు. అందోలు నియోజకవర్గానికి చెందిన మఠం భిక్షపతికి ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. పటాన్‌చెరు నియోజకవర్గం రామచంద్రాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి ఎస్‌ఎ్‌ఫసీ చైర్మన్‌గా నియమించినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఈ నియామకానికి గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో ఆయన పదవిని చేపట్టలేకపోయారు. దుబ్బాకకు చెందిన బక్కి వెంకటయ్యను ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. కాగా వీరి నియామకాలకు సుమారు రెండేళ్ల కిందట గజ్వేల్‌కు చెం దిన వంటేరు ప్రతాప్‌రెడ్డిని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, నర్సాపూర్‌కు చెందిన మాజీ మంత్రి వి.సునీతారెడ్డిని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా, సంగారెడ్డికి చెందిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు హెచ్‌డీసీ చైర్మన్‌ పదవిని, సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ఎర్రోళ్ల శ్రీనివా్‌సకు వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. సంగారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా నియమించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో వీరందరూ పదవులు కోల్పోవాల్సి వస్తున్నది. కాగా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న నర్సాపూర్‌కు చెందిన సునీతారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అలాగే హెచ్‌డీసీ చైర్మన్‌గా ఉన్న చింతా ప్రభాకర్‌ సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారకు. కాగా నాలుగైదు నెలల కిందట కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు చేపట్టిన వారికి మాత్రం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి.

ఎమ్మెల్సీ పదవి అందినట్టే అంది..

పటాన్‌చెరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు ఎ.సత్యనారాయణను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియామకానికి ఆరు నెలల కిందటే కేసీఆర్‌ ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన ఫైలును గవర్నర్‌ ఆమోదం పంపాల్సి ఉన్నది. అయితే నిబంధనల ప్రకారం ఈయన నియామక ప్రతిపాదన లేదంటూ గవర్నర్‌ ఫైలును పెండింగ్‌లో పెట్టారు. దీంతో ప్రభుత్వం మారడంతో సత్యనారాయణ ఎమ్మెల్సీ నియామకం లేనట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

టీఎస్‌ హెచ్‌డీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా

సంగారెడ్డిరూరల్‌, డిసెంబరు 5: రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ (హెచ్‌డిసి) చైర్మన్‌ పదవికి చింతా ప్రభాకర్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 2022 సెప్టెంబరు 28న అప్పటి సీఎం కేసీఆర్‌ చింతా ప్రభాకర్‌ను హెచ్‌డీసీ చైర్మన్‌గా నియమించారు. ఈ పదవిలో 14 నెలల ఏడు రోజుల పాటు ఆయన కొనసాగారు. సాధారణ ఎన్నికల్లో చింతా ప్రభాకర్‌ సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.

Updated Date - 2023-12-06T00:04:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising