ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Harish Rao: కేసీఆర్ చేతిలో తెలంగాణ లేకుంటే..!

ABN, First Publish Date - 2023-06-07T17:21:15+05:30

ఎన్నికలప్పుడు చాలా మంది వస్తుంటారు.. కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేతిలో ఉంటేనే

Harish Rao
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి జిల్లా: పేదలు, రైతుల సంక్షేమమే అజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మునిపల్లి మండలం చిన్న చల్మెడ శివారులో సంగమేశ్వర ఎత్తిపోతల పంపు హౌజ్ నిర్మాణానికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. ఆనాటి ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో సింగూరు కట్టి నీళ్లు మాత్రం హైదరాబాద్ తీసుకుపోయిందని గుర్తుచేశారు. ఆనాటి ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అంటే కేసీఆర్ మాత్రం పండుగ చేసి చూపించారని పేర్కొన్నారు. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందని.. అంతేకాకుండా మద్దతు ధర కూడా ఇస్తుందని వెల్లడించారు. సంగమేశ్వర పథకానికి భూములు ఇచ్చిన రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికలప్పుడు చాలా మంది వస్తుంటారు.. కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేతిలో ఉంటేనే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. వేరే వాళ్ల చేతికి పోతే మాత్రం తెలంగాణ ఆగం అవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మానిక్ రావు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T17:21:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising