ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మహాలక్ష్మి పథకంతో మహిళల్లో ఆనందం

ABN, First Publish Date - 2023-12-11T00:07:26+05:30

సోనియమ్మ మాట మేరకు ప్రారంభించిన మహాలక్ష్మి పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలల్లో ఆనందం వెల్లివిరుస్తోందని వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పేర్కొన్నారు.

ఆరు గ్యారెంటీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్‌కు ఉంది

అనారోగ్యంతో అప్పుల పాలు కాకుండా కాపాడేందుకే ఆరోగ్యశ్రీ

వట్‌పల్లిలో 50 పడకల ఆసుపత్రిని నిర్మిస్తా

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

జోగిపేట, డిసెంబరు 10: సోనియమ్మ మాట మేరకు ప్రారంభించిన మహాలక్ష్మి పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలల్లో ఆనందం వెల్లివిరుస్తోందని వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పేర్కొన్నారు. జోగిపేటలోని ఆర్టీసీ బస్టాండ్‌లో మహాలక్ష్మి పథకాన్ని ఆదివారం ఆయన కలెక్టర్‌ శరత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో ఆయన ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ ప్రారంభించడం సంతోషకరమన్నారు. పేదవారు అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అప్పుల పాలు కావోద్దనే ఆరోగ్యశ్రీని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడంతో కోట్లాది మంది పేదలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

ఇప్పటికే రెండు ప్రారంభించాం.. గడువులోగా మిగతావి కూడా..

సోనియమమ్మ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం మేరకు ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేసే సత్తా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను అమలు చేశామని, మిగిలిన నాలుగు పథకాలను కూడా 100 రోజుల్లో అమలుచేసి తీరతామని స్పష్టం చేశారు. పదేళ్ల అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పజ్రలు ఎన్నుకున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసివారి మెప్పును పొందుతామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వట్‌పల్లిలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజియనల్‌ మేనేజర్‌ ప్రభులత, డిపో మేనేజర్‌ ఉపేందర్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్రనాయకురాలు త్రిష దామోదర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్‌, డాకూరి శంకర్‌, చిట్టిబాబు, పట్లోల రేఖాప్రవీణ్‌, అల్లె శ్రీకాంత్‌, సురేశ్‌, హరిక్రిష్ణాగౌడ్‌, దుర్గేశ్‌, చందర్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివరాజ్‌ యాదవ్‌, నాయకులు డాకూరి వెంకటేశం, ఆర్‌. ప్రదీ్‌పగౌడ్‌, పీ. ప్రవీణ్‌, రాజిరెడ్డి, సందీప్‌ గౌడ్‌, సీహెచ్‌. శివ, గొల్ల శరత్‌, రాజశేఖర్‌, మధు, ప్రేం కుమార్‌, పట్లో రవి, అరిగె రాములు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising