ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కలిసిమెలిసి ఉన్న ప్రాంతాన్ని కలుషితం చేయొద్దు

ABN, First Publish Date - 2023-12-05T23:58:09+05:30

స్థానికేతరులు ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా యత్నించడం తగదు బాగారెడ్డి వారసత్వాన్ని కొనసాగిద్దాం జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు

జహీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్‌, డిసెంబరు 5: జహీరాబాద్‌ నియోజకవర్గంలో ప్రజలు గంగా, జమునా తహజీబ్‌ తరహాలో కలిసిమెలిసి ఉంటున్నారని, అలాంటి వాతవరణాన్ని కలుషితం చేయవద్దని జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివంతగనేత బాగారెడ్డి తరం నుంచి జహీరాబాద్‌ నియోజకవర్గంలో అందరం కలిసిమెలిసి ఉంటున్నామన్నారు. అలాంటి వాతావరణంలోకి స్థానికేతరులు చొరబడి ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా యత్నించడం తగదన్నారు. ఎన్నికలను పరిగణలోకి తీసుకుని వ్యవహరించరాదని, కలిసిమెలిసి ఉంటే నియోజకవర్గంలో అందరం ప్రశాంతంగా ఉంటామన్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు కలిసిమెలిసి ఉండాలని బాగారెడ్డి, మహ్మాద్‌ ఫరీదుద్ధీన్‌, మాజీమంత్రి గీతారెడ్డి నేర్పించారని అదే విధానంతో తాముకూడా ముందుకు వెళ్తామన్నారు. కానీ కొందరి వ్యవహారశైలీవల్ల అందరం ప్రమాదంలో పడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నేతృత్వంలో జహీరాబాద్‌ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని, మున్ముందు మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి సమస్యలేమైన ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీఎ్‌సఐడీసీ చైర్మన్‌ మహ్మాద్‌ తన్వీర్‌, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తట్టు నారాయణ, పీఎసీఎస్‌ చైర్మన్‌ మశ్చందర్‌, నాయకులు బాబీ, యాకూబ్‌, యూనూస్‌, శ్రీకాంత్‌రెడ్డి, మోతీరాం, అబ్ధుల్లా పాల్గొన్నారకు. ఇదిలా ఉండగా నియోజకవర్గ ప్రజలు తనను భారీమెజార్టీతో గెలిపించినందుకు వారందరికి మాణిక్‌రావు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తన గెలుపునకు సహకరించిన వారందరికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

Updated Date - 2023-12-05T23:58:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising